కృష్ణ

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ విజయరావు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను డీఎస్పీ విజయరావు స్వీకరించారు. ఫిర్యాదు దారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వారికి చట్ట పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని ఫిర్యాదుల పరిష్కారం నిమిత్తం సంబందిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని డీఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ మహబూబ్ భాషా, స్పెషల్ బ్రాంచ్ సీఐ కిషోర్‌బాబు, డీసీఆర్‌బీ సీఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కొల్లేరు ఆక్రమణలను తొలగించండి

మండవల్లి, జూన్ 24: కొల్లేరు సరస్సును ఆక్రమణల నుంచి కాపాడి 88 గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను రక్షించాలని సమాచార హక్కు ఐక్య వేదిక నాయకులు ఎంపీడీవో వీరాస్వామిని కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమంలో వారు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కొల్లేరు సరస్సును కొందరు ఆక్రమించి చేపల చెరువులు తవ్వటం వల్ల వరదలు వస్తే లోతట్టు ప్రాంతాలు ముంపుకుగురయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 15 డ్రెయిన్లు, మరో 15 ఛానల్స్ ద్వారా వరద నీరు కొల్లేరు సరస్సులో కలిసి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తోందని, కొల్లేరు ఆపరేషన్ చేపట్టక ముందు కంటే ప్రస్తుతం ఎక్కువగా సరస్సు ఆక్రమణలతో నిండిపోయిందని వారు పేర్కొన్నారు. కొల్లేరు సరస్సులో వరద నీరు దిగువకు పారుదల కాకుండా అడ్డుగా చేపల చెరువుల పెద్ద పెద్ద గట్లు అడ్డుగా ఉన్నాయన్నారు. ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు పడి ఉధృతంగా కొల్లేరులోకి వరద నీరు వస్తే దిగువకు వరద నీరు పారుదలకాక మండలంలోని పది గ్రామాలతోపాటు విజయవాడ వరకు 88 గ్రామాలల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని వారు తెలిపారు. 2-3 ఏళ్ల నుంచి అధిక వర్షాలు లేకపోవటం వల్ల ముంపు సమస్య ఏర్పడలేదని, ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకుంటే ముంపు వల్ల ప్రాణ, ఆస్థి నష్టం సంభవించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొల్లేరు ఆక్రమణలను తొలగించి సరస్సును విస్తరించాలని పూడికపోయిన పైలెట్ ఛానల్‌ను కూడా అభివృద్ధి చేయాలని నాయకులు ఎల్. ఎస్.్భస్కరరావు, బండి రంగారావు, తెంటు అప్పారావు, ఇంటి అశీర్వాదం కోరారు.