కృష్ణ

కలెక్టరేట్ ఎదుట వృద్ధ కళాకారుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): వృద్ధ కళాకారులకు గత డిసెంబరు 2018 నుండి పెన్షన్‌లు మంజూరు చేయటం లేదని, వెంటనే పెన్షన్‌లను మంజూరు చేసి వృద్ధ కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం వృద్ధ కళాకారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో 7,600 మంది వృద్ధ కళాకారులు ఉన్నారని, వారికి గతంలో పెన్షన్‌లు ఇచ్చారని, కానీ గత డిసెంబరు 2018 నుండి పెన్షన్‌లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ కళాకారులకు పెన్షన్‌లు మంజూరు చేసి మా జీవన విధానానికి తోడ్పడాలని కోరారు. లింగం ఫిలిఫ్‌ప్, వై బాబూరావు, కెవి అప్పారావు, టీవీ చలపతిరావు, సురేంద్రరావు, ఎన్ ఉమామహేశ్వరరావు, కంచర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ ఏడాది చెరకు క్రషింగ్ లక్ష్మీపురంలోనే జరగాలి
చల్లపల్లి, జూన్ 24: 2019-2020కి సంబంధించి చెరకు క్రషింగ్‌ను లక్ష్మీపురం కెసీపీ కర్మాగారంలోనే జరపాలని కెసీపీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు. 2019-20 సీజన్‌కు చెరకును ఉయ్యూరుకు తరలించేందుకు యాజమాన్యం నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం లక్ష్మీపురం కెసీపీ ఆడిటోరియంలో కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంప్లారుూస్ యూనియన్ కార్యదర్శి ఎన్ సుబ్రహ్మణ్యం కర్మాగారం ప్రస్తుత పరిస్థితిని, ఉయ్యూరులో క్రషింగ్ అంశాన్ని కార్మికులకు వివరించగా కార్మికులంతా ముక్తకంఠంతో ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. లక్ష్మీపురం కర్మాగారం పరిధిలోని చెరకును ఇక్కడే గానుగ ఆడాలని విజ్ఞప్తి చేశారు. కర్మాగారంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు రోడ్డున పడకుండా యాజమాన్యం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ సమావేశంలో రెండు యూనియన్‌లకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.