కృష్ణ

మునిసిపల్ చైర్మన్ పదవికి రాజగోపాల్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: మున్సిపల్ చైర్మన్ పదవికి చైర్మన్ రాజగోపాల్ రాజీనామా చేస్తూ సన్మాన సభలో విప్ సామినేని ఉదయభానుకు లేఖ అందజేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. తాను, తన అనుచరులు తెలిసీ తెలియక చేసిన వ్యవహారానికి పార్టీకి, అధిష్టానానికి ఇబ్బంది కల్గించరాదని అన్నారు. జరిగిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటిస్తూ రాజీనామా లేఖను సభా వేదికపై విప్ సామినేని ఉదయభానుకు అందించారు. పదవీ కాలం తక్కువగా ఉందని, దీనిపై నిర్ణయం తీసుకుందామని సామినేని అన్నారు. తన ప్రవర్తనపై పోలీసు సిబ్బందికి, అధికారులకు పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతున్నట్లు చైర్మన్ రాజగోపాల్ అన్నారు.