కృష్ణ

మోగిన బదిలీల బాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారుల బదిలీల ప్రక్రియ సర్వసాధారణంగా జరుగుతుంటుంది. పాలనాపరంగానూ, రాజకీయ పరంగానూ అధికారుల బదిలీలు జరుగుతుంటాయి. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిథులు తమకు అనుకూలమైన వారిని తమ తమ ప్రాంతాల్లో నియమించుకోవడం అనవాయితీగా వస్తున్న సాంప్రదాయమే. ఇందులో భాగంగానే ఇటీవల ఏర్పడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారుల బదిలీలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి స్థాయిలో తొలిగా ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను భారీగా చేసింది. ఇందులో భాగంగా రాజధాని జిల్లాలో ఒకటైన కృష్ణాజిల్లాలో ఇటీవలే ఇరువురు ఐపీఎస్ అధికారులు, ఇరువురు ఐఎఎస్ అధికారులు బదిలీ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విజయవాడ డీసీపీ-2గా వ్యవహరిస్తున్న అప్పల నాయుడును బదిలీ చేశారు. వారి స్థానంలో జిల్లా ఎస్పీగా ఎం రవీంద్రనాధ్ బాబు, డీసీపీ-2గా విజయారావును నియమించారు. అలాగే గత మూడు రోజుల క్రితం చేపట్టిన ఐఎఎస్ అధికారుల బదిలీల్లో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న కృత్తికా శుక్లా, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఎం రామారావులను బదిలీ చేసి వారి స్థానంలో జెసీగా డా. కె మాధవీలత, విజయవాడ కమిషనర్‌గా ప్రసన్న వెంకటేష్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేటి నుండి ప్రారంభమయ్యే బదిలీల ప్రక్రియను జులై 6వతేదీతో ముగించనున్నారు. ఉద్యోగుల రిక్వెస్ట్‌లు, పాలనా సౌలభ్యమే ప్రాతిపదికన బదిలీలు చేపట్టనున్నారు. ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా పని చేస్తున్న వారిని ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో బదిలీల నుండి విద్యా శాఖకు మినహాయింపు లభించింది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను జారీ చేసింది. పదవీ విరమణకు మరో యేడాది సమయం ఉన్న వారిని బదిలీల నుండి మినహాయింపు ఇచ్చారు. అలాగే ఉద్యోగ సంఘ నాయకుల బదిలీలు కూడా జరగకపోవచ్చు. ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర శాఖాపరమైన ఆరోపణలు ఉన్న వారిని కూడా బదిలీ చేసే అవకాశం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలను దృష్టి పెట్టుకుని ఆయా శాఖాధిపతులు వారి వారి శాఖల వారీగా బదిలీకి అర్హులైన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఆ జాబితా ఆధారంగా వారి బదిలీలు ఉంటాయి. ప్రస్తుతం శాఖాధిపతులు బదిలీ అధికారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారుల బదిలీలపైనే అందరి దృష్టి ఉంటుంది. జిల్లా అధికారుల విషయానికొస్తే ఎన్నికల ముందే దాదాపు 70 శాతం జిల్లాలో జిల్లా స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. మండల స్థాయి అధికారుల్లో ఎంపీడీవో, తహశీల్దార్ల బదిలీలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఎన్నికల ముందు సర్వసాధారణంగా ఎంపీడీవోలు, తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసి ఇతర జిల్లాల వారిని ఇక్కడకు బదిలీ చేస్తారు. అలాగే ఎన్నికల ముందు జిల్లాలో పని చేస్తున్న ఎంపీడీవోలు, తహశీల్దార్లు అంతా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు బదిలీ అయ్యారు. ఇప్పుడు వీరందరినీ ఎన్నికల ముందు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా వారి వారి స్థానాలకు వచ్చిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు వారి బదిలీలు కూడా ఉంటాయి.

అక్రమ కట్టడాలు తొలగిస్తుంటే వణుకెందుకు?

టీడీపీ నేతలను నిలదీసిన ఎమ్మెల్యే సామినేని

జగ్గయ్యపేట, జూన్ 25: నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదిని ఆనుకుని కట్టిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చి వేయాలని నిర్ణయిస్తే తెలుగుదేశం నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రశ్నించారు. మంగళవారం తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజావేదికను కూలకొట్టాలని కోవడం తుగ్లక్ చర్య అని అనడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి సొమ్ముతో అక్రమంగా ప్రజావేదిక నిర్మించారన్నారు. ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీఆర్‌డీఎ నివేదిక ఇచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మించారని దాంట్లో స్పష్టం చేశారని, అందుకే దానిని కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అధికారంలో ఉండగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అక్రమ నివాసం పక్కన అనధికారికంగా ప్రజావేదిక నిర్మించారని, అది పేరుకు ప్రభుత్వ భవనమే అయినా టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారని ఆరోపించారు. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాక అది తనకే ఇవ్వాలని చంద్రబాబు కోరడం విడ్డూరమని సామినేని అన్నారు. ప్రజావేదికను కూల్చివేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, దాన్ని చూసి ఓర్వలేని టీడీపీ నేతలు మొసలి కన్నీరు కార్చుతున్నారని సామినేని అన్నారు. ఈ సమావేశంలో నేతలు తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.