కృష్ణ

మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు : రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకట రమణ, కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక సీతారామ ఫంక్షన్ హాలులో స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆధ్వర్యంలో మత్స్య రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు మోపిదేవి వెంకట రమణ, కొడాలి నాని, పేర్ని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కైకలూరు ప్రాంతం మత్స్య పరిశ్రమకు ప్రసిద్ధి గాంచిందన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోందని, ముఖ్యమంత్రి జగన్ ఈ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రధానంగా నీటి వనరులతో ముడిపడి ఉన్న ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తేనే రైతులు అభివృద్ధి చెందుతారని, అందుకు సాగునీరు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పోలవరం పూర్తయితే పుష్కలంగా నీరు ఉంటుందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ప్రాజెక్ట్ పూర్తి కాలేదన్నారు.