కృష్ణ

జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తహశీల్దార్ల బదిలీలతో పాటు రెవెన్యూ శాఖలోని అన్ని కేడర్లలో భారీగా బదిలీలు చేస్తూ జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 71 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల విధులకై ఇతర జిల్లాల నుండి వచ్చిన తహశీల్దార్లలో నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో పని చేస్తున్న వారు మినహా మిగిలిన వారంతా వారి వారి జిల్లాలకు గత రెండు రోజుల క్రితమే వెళ్లిన సంగతి తెలిసిందే. వారి స్థానంలో గతంలో పని చేసి ఇతర జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లంతా వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా వీరందరినీ కలెక్టర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో కొనసాగుతున్న తహశీల్దార్లను మాత్రం మార్పు చేయలేదు. ఎన్నికల వ్యయానికి సంబంధించి వీరు పూర్తి బాధ్యత వహించాల్సి ఉండగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీరిని మరికొన్ని రోజుల పాటు కొనసాగించనున్నారు. 71 మంది తహశీల్దార్లతో పాటు 112 మంది సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ముగ్గురు టైపిస్టులు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అవనిగడ్డ తహశీల్దార్‌గా విక్టర్‌బాబు, బంటుమిల్లి తహశీల్దార్‌గా కె గోపాలకృష్ణ, గూడూరుకు జె విమల కుమారి, నాగాయలంకకు ఎం వెంకట్రామయ్య, మచిలీపట్నంకు డి సునీల్ బాబు, ఘంటసాలకు సిహెచ్ శిరీషదేవి, చల్లపల్లికి కె స్వర్ణమేరి, పెడనకు పి మధుసూదనరావు, మొవ్వకు డి రాజ్యలక్ష్మి, మోపిదేవికి ఎం పద్మకుమారి, కోడూరుకు డి కోటేశ్వరరావు, కృత్తివెన్నుకు యండీ అసీఫా, గుడ్లవల్లేరుకు కె ఆంజనేయులు, కైకలూరుకు ఎం సూర్యారావు, కలిదిండికి వి స్వామి నాయుడు, ముదినేపల్లికి కె శ్రీనివాస్, పెదపారుపూడికి ఎంవి సత్యనారాయణ, నందివాడకు టి మధనమోహనరావు, పామర్రుకు ఎన్ సురేష్‌బాబు, గుడివాడకు బి సాయిశ్రీనివాస నాయక్, మండవల్లికి బి శ్రీను నాయక్, ఆగిరిపల్లికి వివి భరత్‌రెడ్డి, బాపులపాడుకు సిహెచ్ నరసింహరావు, చాట్రాయికి ఎ జనార్ధనరావు, గంపలగూడెంకు డి పద్మజ, గన్నవరంకు వి మురళీకృష్ణ, ముసునూరుకు బి ఆశయ్య, తిరువూరుకు షేక్ లతీఫ్ పాషా, ఉంగుటూరుకు డివిఎస్ యల్లారావు, విస్సన్నపేటకు బి మురళీకృష్ణ, నూజివీడుకు ఎం సురేష్ కుమార్, రెడ్డిగూడెంకు ఎస్ బుల్లిబాబు, పమిడిముక్కలకు కె వెంకట శివయ్య, ఉయ్యూరుకు కెబిఎస్ ప్రసాద్, ఎ.కొండూరుకు జి బాలకృష్ణరెడ్డి, జి.కొండూరుకు ఇంతియాజ్ పాషా షేక్, ఇబ్రహీంపట్నంకు అబ్దుల్ రెహ్మాన్ మస్తాన్, కంకిపాడుకు టివి సతీష్, మైలవరంకు ఆర్‌వి రోహిణిదేవి, పెనమలూరుకు జి భద్రు, విజయవాడ ఈస్ట్‌కు జిఎన్‌విఆర్ లలితాంజలి, వత్సవాయికి బి రామానాయక్, జగ్గయ్యపేటకు ఆర్ రామకృష్ణ, తోట్లవల్లూరుకు శ్రీరామకృష్ణ, విజయవాడ వెస్ట్‌కు బి సుగుణ, పెనుగంచిప్రోలుకు ఎస్ నరసింహరావు, చందర్లపాడుకు ఎస్‌వి జనార్ధనరావు, కంచికచర్లకు వి రాజకుమారి, విజయవాడ సెంట్రల్‌కు ఎ రవీంద్రరావు, నందిగామకు డి చంద్రశేఖర్, విజయవాడ నార్త్‌కు సి వాసుదేవరావు, విజయవాడ రూరల్‌కు డి వనజాక్షి, వీరుళ్లపాడుకు ఆర్ పాపమ్మను నియమించారు. కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా వీర్నాల శ్రీను, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లుగా కె నాగేశ్వరరావు, జివి ప్రసాద్, సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్, ఎస్ శ్రీనివాసరెడ్డి, డి ప్రశాంతి, ఎఎమ్‌ఎన్ విజయలక్ష్మి, షకీరున్నీసా బేగం, ఆర్ సాంబశివరావు, బి నెల్సన్ పాల్ బాబు, పి జయశ్రీని నియమించారు. బందరు ఆర్డీవో కార్యాలయ ఎగా సిహెచ్‌వి చంద్రశేఖరరావు, విజయవాడ సబ్ కలెక్టరేట్ ఎఓగా ఎం మాధురి, గుడివాడ ఆర్డీవో కార్యాలయ ఎఓగా ఐవివిఎస్‌ఎస్‌ఎస్ శర్మ, నూజివీడు ఆర్డీవో కార్యాలయ ఎఓగా ఎం శ్రీనివాస్, స్పెషల్ తహశీల్దార్ (కెఆర్‌ఆర్‌సీ) బందరు, నూజివీడు, విజయవాడ ఆర్డీవో కార్యాలయ తహశీల్దార్‌గా కె రవి శంకర్, కె మైనర్ బాబు, బి నారాయణలను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.