కృష్ణ

హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలకు కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలకు తెర లేపింది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాధ్ బాబు స్వీయ పర్యవేక్షణలో శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్స్ బదిలీ కౌనె్సలింగ్ నిర్వహించారు. ఒకే స్టేషన్‌లో ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్న వారి జాబితాను తయారు చేసి బదిలీల ప్రక్రియ నిర్వహించారు. తొలి రోజు 50 మంది హెడ్ కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు సీనియార్టి జాబితా ప్రకారం బదిలీ కౌనె్సలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుని జిల్లాలో ఉన్న ఖాళీల ఆధారంగా బదిలీ కౌన్సిలింగ్ నిర్వహించారు. బదిలీల ప్రక్రియ అంతా పూర్తి స్థాయి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రవీంద్రనాధ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సత్తిబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విజయారావు, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, జిల్లా పోలీసు కార్యాలయ ఎఓ మూర్తి, స్పెషల్ బ్రాంచ్ సీఐలు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, ఎ-1 కోటేశ్వరరావు, ఎ-2 కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.

అడిషనల్ ఎస్పీగా సత్తిబాబు
మచిలీపట్నం, జూలై 12: జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్‌గా మోకా సత్తిబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అడిషనల్ ఎస్పీగా పని చేసిన సోమంచి సాయికృష్ణ ఎసీబీకి బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో 2010వ బ్యాచ్‌కు చెందిన మోకా సత్తిబాబును డీజీపీ గౌతమ్ సవాంగ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ఎఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు ఎఎస్పీగా వచ్చిన సత్తిబాబును జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాధ్ బాబుతో పాటు జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సీఐలు అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సత్తిబాబు 2010లో ఏపీపీఎస్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణులై డైరెక్ట్ డీఎస్పీగా పోలీసు శాఖలో అడుగు పెట్టారు. తొలిగా ఖమ్మం జిల్లా వైరా నందు రెండు సంవత్సరాలు విధులు నిర్వర్తించిన ఆయన ఏలూరు టౌన్ డీఎస్పీగా యేడాది పాటు పని చేశారు. ఆ తర్వాత పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ (హైదరాబాద్)లో, రైల్వేలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం సర్వశిక్షాభియాన్ స్టేట్ ట్రైబల్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ జిల్లాకు అడిషనల్ ఎస్పీగా బదిలీపై వచ్చారు.