కృష్ణ

తహశీల్దార్ల బదిలీల్లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా జరిగిన తహశీల్దార్ల బదిలీల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. గత రెండు రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా 71 మంది తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. పరిపాలనాపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని వీరిలో తొమ్మిది మంది తహశీల్దార్ల పోస్టింగ్‌లలో మార్పులు చేర్పులు చేశారు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్‌గా బదిలీ అయిన అబ్దుల్ రెహ్మాన్ మస్తాన్‌ను నందివాడ తహశీల్దార్‌గా, నందవాడ తహశీల్దార్ టి మధన మోహనరావును ఇబ్రహీంపట్నం తహశీల్దార్‌గా, వీరుళ్లపాడు తహశీల్దార్ ఆర్ పద్మను గుడివాడ తహశీల్దార్‌గా, గుడివాడ తహశీల్దార్ బి సాయి శ్రీనివాస నాయక్‌ను వీరుళ్లపాడు తహశీల్దార్‌గా, తిరువూరు తహశీల్దార్ షేక్ లతీఫ్ పాషాను కోడూరు తహశీల్దార్‌గా, పెనుగంచిప్రోలు తహశీల్దార్ ఎస్ నరసింహరావును తిరువూరు తహశీల్దార్‌గా, కోడూరు తహశీల్దార్ డి కోటేశ్వరరావును పెనుగంచిప్రోలు తహశీల్దార్‌గా బదిలీ చేశారు. కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా నియమితులైన ఆర్ సాంబశివరావును కృత్తివెన్ను తహశీల్దార్‌గా, కృత్తివెన్ను తహశీల్దార్‌గా నియమితులైన యండీ అసీఫాను కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా 54 మంది డెప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కూడా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు

*అర్ధరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు

పెడన, జూలై 12: తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రముఖ కలంకారీ వ్యాపారస్థుడు బళ్ళ ప్రసాద్ నివాసంలో శుక్రవారం ఆదాయ పన్ను శాఖాధికారులు నిర్వహించిన సోదాలు పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఉదయం 10గంటలకు ప్రారంభమైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగడం ఉత్కంఠతకు గురి చేసింది. ఇతరులెవరినీ లోనికి రాకుండా, లోపలి వారు బయటకు వెళ్లకుండా తలుపులు మూసేసి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బళ్ళ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఆయన ఆ పార్టీ తరపున ఛైర్మన్ అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరగటం విశేషం. అయితే దాడులకు సంబంధించి ఎటువంటి వివరాలు రాత్రి పొద్దుపోయే వరకు బహిర్గతం కాలేదు. జాయింట్ డైరెక్టర్ సంధ్యారాణి నేతృత్వంలో విజయవాడ, మచిలీపట్నం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.