కృష్ణ

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాధ్ బాబు తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యను కూలంకషంగా తెలుసుకుని పరిష్కార చర్యల నిమిత్తం సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు శాఖాపరంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు పోలీసు స్టేషన్‌లలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజలు అర్జీలు ఇవ్వవచ్చన్నారు. నిర్ణీత గడువు లోపు అర్జీలకు సంబంధించి పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విజయారావు, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.