కృష్ణ

‘స్పందన’కే తొలి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్పందనలో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించి అర్జీదారులకు తగు న్యాయం చేయాలన్నారు. స్పందన కార్యక్రమ నిర్వహణపై సోమవారం ఉదయం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లాలోని ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువు లోపు అర్జీలని పరిష్కరించాలన్నారు. గత వారంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో అర్జీదారునికి ఆ బాధ్యత, నిర్లక్ష్యంతో సమాధానం ఇచ్చిన ఎఎస్‌ఓ ఉదయ భాస్కర్‌ను సస్పెండ్ చేశామన్నారు. సీఎం జరిపిన తొలి సమీక్షలోనే జిల్లా నుండి ఒక ఉద్యోగి సస్పెండ్ కావడం అందరికీ గుణపాఠం కావాలన్నారు. నిర్లక్ష్య ధోరణి విడనాడి ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. అసంపూర్తి సమాధానాల వల్ల ఉద్యోగానికే ఎసరు వస్తుందన్నారు. వినతిపత్రంతో పాటు సరైన డాక్యుమెంట్లు ఇవ్వకపోతే అర్జీదారునికి ఫోన్ చేసి తెప్పించుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రతి మండల అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్‌లు, నివేశన స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని వారి అర్హతలను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో మార్టర్ రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. అర్జీల తిరస్కరణకు సహేతుక కారణాలు తెలపాలన్నారు. ప్రతి అధికారి వారి పరిధిలో స్పందన పెండింగ్ అర్జీల సమాచారంతో సంసిద్ధంగా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ మీసేవలో గడువు దాటిన అర్జీలు సత్వరమే పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల పెండింగ్ అర్జీల సంఖ్యను ఆమె సమావేశంలో చదివి వినిపించారు. సకాలంలో పరిష్కరించని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెసీ-2 పిడుగు బాబూరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, డీఆర్‌డీఎ పీడీ ఎం శ్రీనివాసరావు, మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా, హౌసింగ్ పీడీ ధనుంజయుడు తదితరులు పాల్గొన్నారు.