కృష్ణ

చల్లనితల్లి.. ప్రకృతి మాత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మ ప్రకృతిమాత శాకంబరీదేవిగా ప్రత్యేక అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చింది. శాకంబరీ మహోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం వేకువజాము నుండే భక్తులకు ఈదేవిని దర్శనం చేసుకుని ఆమె ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రికి బారులు తీరారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈచల్లని తల్లీ కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ప్రూట్స్‌ను సర్వాభరణాలుగా ధరించి ఆషాడ మాసంలో భక్తులకు ప్రత్యేక అలంకారంతో దర్శనం ఇచ్చింది. దాతల నుండి సేకరించిన కూరగాయలు, ఆకుకూరలు, డ్రై పూట్స్‌తోపాటు నిమ్మకాయలు, అరటికాయలు, కరేపాకుతో ఆలయ సిబ్బంది అమ్మవారి మూల విరాట్‌తోపాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాయాలు, అమ్మవారి సన్నిధి, విమాన ప్రాకారం, రాజగోపురం, శ్రీ మల్లిఖార్జున మహామండపంలోని ఉత్సవ మూర్తి, ఆలయ ప్రాకారం, ఘాట్‌రోడ్‌లోని శ్రీ కామధేన్ అమ్మవారి సన్నిధి పూర్తిస్థాయిలో వీటితోనే అలంకరించటంతో అమ్మవారి సన్నిధికి వచ్చిన భక్తులు ఒక ప్రకృతి ఒడిలోనికి ప్రవేశించిన అనుభూతిని పొందారు. అంతరాలయంలోని మూల విరాట్‌ను దర్శనం చేసుకున్న భక్తులు అనంతరం శ్రీ మల్లిఖార్జున మహామండపంలోని ఉత్సవ మూర్తిన్ని దర్శనం చేసుకోనే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేయటంతో భక్తులు ఈవిధంగానే అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కందబం ప్రసాదాన్ని భక్తులకు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. వేకువ జామున 5గంటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 2గంటల వరకు, తిరిగి సాయంత్రం 5గంటల నుండి రాత్రి 9గంటల వరకు కొనసాగింది. సోమవారం ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్, పలు పార్టీలకు చెందిన నేతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలకు చెందిన పలువురు ఉన్నతస్ధాయి అధికారులు ఈశాకంబరీదేవిని దర్శనం చేసుకున్నారు.