కృష్ణ

వచ్చామా... వెళ్లామా కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు : బీ కేర్‌పుల్.... తమాషాలు వద్దు... పనిలో ప్రగతి కనిపించాలి, సమావేశాలకు వచ్చామా.. వెళ్ళామా కాదు చెప్పిన అంశాలను శ్రద్ధగా విని ఆచరణలో పెట్టండి, గత వారంలో చెప్పిన అంశాల్లో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు సరికదా అధికారుల మధ్య సమన్వయమూ లేదని జేసీ -2 బాబూరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నిర్వహించి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కనీసం గ్రామ కమిటీలను కూడా వేయలేకపోయారు. మండలంలో భూగర్భజలాలు అడుగంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నా మండల అధికారుల్లో కాస్తకూడా చలనం రావడం లేదని మండల అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పనిచేయని అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తానని హెచ్చరించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ కార్యాలయ మీటింగ్ హాల్‌లో మంగళవారం జలశక్తి అభియాన్ పథకంపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో జేసీ -2 బాబూరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారం రోజులుగా ఏయే చర్యలు తీసుకున్నారన్న దానిపై ఆయా శాఖల అధికారులను అడిగితెలుసుకున్నారు. మనకున్నది 75 రోజులు మాత్రమే ఈ వ్యవధిలోనే మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేస్తేనే తప్ప లక్ష్యాలను చేరుకోలేమని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భూగర్భజలాలు పెంచేందుకు పంట గుంటలు, ఇంకుడు గుంటలు, చెక్‌డ్యామ్‌ల ఎంతమేర అవసరమవుతాయో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి గురువారం రానున్న కేంద్ర బృందానికి నివేదిక సమర్పించాలని సంబంధిత గ్రౌండ్ వాటర్, డ్వామా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండలంలో ఉపయోగించకుండా వదిలేసినవి 300 బోర్లు ఉన్నాయని, వాటిని వినియోగించుకుని నీటి నిల్వలు పెంచేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, మండలంలో భూగర్భజలాల స్థాయిని పెంచే విధంగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని, ఇదంతా చిత్తశుద్ధితో చేస్తేనే పెట్టుకున్న సంకల్పం నేరవేరుతుందని జేసీ -2 బాబూరావు అధికారులకు హితవుపలికారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ గురుప్రకాష్, మైక్రో ఇరిగేషన్ డీడీ పి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రాజ్యలక్ష్మి, ఆర్‌డబ్యుఎస్ ఎస్‌ఇ సాయినాథ్, గ్రౌండ్‌వాటర్ డీడీ సాంబశివరావు, జిల్లా సర్వేయర్ ఎన్‌వి సత్యనారాయణ, ఎంపీడీఓ పార్థసారథి, ఎపీడీ రమణారావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.