కృష్ణ

పాము కాట్లపై స్పందించిన జిల్లా యంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : గత కొన్ని రోజులుగా దివిసీమలో కలకలం సృష్టిస్తున్న పాము కాట్లపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. గత వారం పది రోజులుగా దివిసీమలోని పలు మండలాల్లో వ్యవసాయ కూలీలు పాము కాట్లకు గురై ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రతి రోజూ ఏదో ఒకటి రెండు గ్రామాల్లో పాముకాటు బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కోడూరు, ఘంటసాల మండలాల్లో పాము కాటుకు గురైన ఇరువురు మృతి చెందారు. దీంతో పాముకాట్లను జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. గురువారం సాయంత్రం బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కర్ అవనిగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాముకాటు బాధితులను పరామర్శించారు. పాముకాట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. శుక్రవారం అవనిగడ్డలోనే దివిసీమకు చెందిన ఆరు మండలాలకు చెందిన అధికారులు, ప్రజలతో జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఆర్డీవో ఉదయ భాస్కర్ తెలిపారు.