కృష్ణ

నీటి సంరక్షణ బాధ్యత అందరిదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు : నీటి సంరక్షణ మనందరి బాధ్యతగా గుర్తెరిగి నీటి వృద్దాను అరికడుతూ నీటిని పొదుపుగా వాడుకుందామని సెంట్రల్ బృందం సభ్యులు వివేక్‌ఒమర్ పిలుపునిచ్చారు. మండలంలో జరుగుతున్న జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా గురువారం ఢిల్లీ నుండి సెంట్రల్ బృందం సభ్యులు మండల కేంద్రమైన ముసునూరులో పర్యటించారు. ఈసందర్భంగా పంట పొలాల్లో పాడైపోయిన బోరు వద్ద నీటిని ఇంకింపచేసేందుకు గుంట ఏర్పాటు నిర్మాణానికి జేసీ -2 బాబురావు, నూజివీడు సబ్‌కలెక్టరు స్వప్నిల్ దినకర్, డ్వామా పీడీ గురుప్రకాష్‌లతో కలిసి సెంట్రల్ బృందం సభ్యులు వివేక్‌ఒమర్, బిషక్‌కరబంధా, అనుపమలు శంఖుస్థాపన చేశారు. అనంతరం రైతు పొలంలో ఏర్పాటు చేసిన పంట గుంటను ఈబృందం పరిశీలించి జియో ట్యాగింగ్ చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూగర్భజలాలు పెంచేందుకు చేపట్టవలసిన చర్యలతో పాటు నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల నమూనాలను సెంట్రల్ బృందానికి వివరించారు. సెంట్రల్ బృందం సభ్యులకు మండల స్థితి గతులను, జలశక్తి అభియాన్ పథకం ద్వారా తీసుకుంటున్న చర్యలను జేసీ -2 బాబురావు వివరించారు. ఈకార్యక్రమంలో ఉద్యానవన, వ్యవసాయ, భూగర్భజల శాఖల ఉన్నతాధికారులతో పాటు మండల స్ధాయి అధికారులు పాల్గొన్నారు.