కృష్ణ

పాముకాటు బాధితులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, : పాముకాటు విషయంలో అధికారులు సామాజిక బాధ్యతగా వ్యవహరించి బాధితులకు సేవలందించాలని కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ కోరారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమావేశ మందిరంలో పాము కాట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాముకాట్లపై విస్తృత అవగాహన కల్పించటం కోసమే గ్రామ స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు అవగాహన కల్పించటం జరుగుతుందన్నారు. పాము కాట్ల బాధితులు నాటు వైద్యాలను, మంత్రాలను ఆశించవద్దని కలెక్టర్ సూచించారు. బందరు ఆర్డీఓ ఉదయ భాస్కర్ ఇక్కడే మకాం చేస్తారని, ఆయనను తరచూ బాధితులు సంప్రదించవచ్చని అన్నారు. నియోజకవర్గంలో పాము కాట్లు పెరగటం పట్ల ఎమ్మెల్యే రమేష్‌బాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారన్నారు. స్పందించిన సీఎం జగన్ పాము కాటు మరణాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. దానిలో భాగంగానే అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. పాము కాటు బాధితులకు సకాలంలో వైద్యం చేసేందుకు మొబైల్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో మరో అంబులెన్స్, రెండు 108 వాహనాలను సిద్ధంగా ఉంచామన్నారు. అంబులెన్స్‌లో నిపుణులైన వైద్యులు ఉంటారన్నారు. కోడూరు, నాగాయలంక మండలాల్లోని ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటలు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోడూరు, నాగాయలంక మండలంలో పాము కాటు విరుగుడు మందులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇకపై ఒక్కరు కూడా పాము కాటుతో చనిపోయినా అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పాము కాటుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కరపత్రాలను ముద్రించామని, ఇందులో ఫోన్ నెంబర్ ఉంచామని, ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీఓ ఉదయ భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుతో పాటు పలువురు జిల్లా అధికారులు డీపీఓ రవీంద్రర్, మత్స్యశాఖ జెడీ యాకూబ్ బాషా, డీఎల్‌పీఓ జ్యోతిర్మయి, ఫిషరీష్ ఎడీఎ సురేష్‌బాబు, వ్యవసాయశాఖ ఎడీఎ వెంకటమణి, ఎన్‌జీవో ఆర్గనైజర్ డా. జ్యోతి, డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు.