కృష్ణ

రికార్డుల వ్యవస్థను క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రతి విభాగంలోనూ రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని పలు విభాగాలతో పాటు అనుబంధ విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం పని చేసే చోట ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలన్నారు. పరిశుభ్రత పాటిస్తూనే రికార్డులను సక్రమంగా నమోదు చేయాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. నిరక్షరాస్యులైన అర్జీదారుల కోసం ఒక కానిస్టేబుల్‌తో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తపాల్ విభాగాన్ని సందర్శించిన ఎస్పీ అక్కడి సిబ్బందితో మాట్లాడి వారి విధులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్ల నుండి వచ్చే ఫిర్యాదులు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేస్తూ రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలన్నారు. పోలీసు కమ్యూనికేషన్ విభాగాన్ని పరిశీలించిన ఆయన రెండు విభాగాలుగా ఉండి పని చేస్తుండటాన్ని గుర్తించారు. ఇకపై అలా కాకుండా ఒకే ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించి నూతన భవనం నిర్మించే వరకు పోలీసు కంట్రోల్ రూమం ఉన్న భవనంలోకి కింది భాగంలోని హాలులోకి తాత్కాలికంగా మార్చి రోజు వారి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా పోలీస్ స్టోర్స్‌ను తనిఖీ చేశారు. పోలీసు సిబ్బందికి నాణ్యమైన సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీసీఆర్‌బీ విభాగాన్ని నూతన భవనంలోకి తరలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐలు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ కమ్యూనికేషన్ ప్రసాద్, డీసీఆర్‌బీ ఎస్‌ఐలు రంగనాథ్, గఫార్, ఆర్‌ఎస్‌ఐలు సతీష్, రాజేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.