కృష్ణ

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, బూత్ కన్వీనర్ 90శాతం స్థానాల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్‌జిఎస్ కళాశాలలో నియోజకవర్గ స్థాయి కన్వీనర్‌లు, సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించామని ఆదే ఉత్సాహంతో రానున్న మున్సిపాలిటీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల ఎన్నికల్లో 90శాతం మన పార్టీనే కైవశం చేసుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బూత్ కమిటీ కన్వీనర్‌లు, సభ్యుల పాత్ర కీలకమైనదని, ప్రజలకు అండదండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తొలి బడ్జెట్‌లోనే 80శాతం హామీలను నెరవేర్చేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని, రైతు భరోసాతో సహా వివిధ పథకాలను వివరిస్తూ జన రంజక బడ్జెట్ ప్రవేశపెట్టిడంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని సామినేని అన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా నియోజకవర్గంలో 1208మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వివరిస్తూ బిసిలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ప్రభుత్వ పథకాలు వివరించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉదయభాను సతీమణి విమలాభాను, నాయకులు తన్నీరు నాగేశ్వరరావు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల నేతలు చిలుకూరి శ్రీనివాసరావు, గాదెల రామారావు, కంచేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.