కృష్ణ

ట్రాఫిక్ చక్కదిద్దండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రోజు రోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ చిక్కుముడులను విప్పేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని రాష్ట్ర రవాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రవీంద్రనాధ్ బాబుతో కలిసి పోలీస్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, ఏపీఎస్ ఆర్టీసీ, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో ప్రధాన కూడళ్లు అయిన చల్లరాస్తా సెంటరు, కోనేరుసెంటరు, రాజావారి సెంటరు, నవకళా సెంటరు, రైతు బజారు, రామానాయుడుపేట, తోటవారితుళ్ల సెంటర్ల వద్ద వాహనాలు, ప్రజలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను సమావేశం చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ విజయవాడ జాతీయ రహదారి నుండి మచిలీపట్నంలోకి ప్రవేశించే మార్గంలో ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు రంబుల్ స్ట్రిక్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోనేరుసెంటరులో వాహనాలు నిలిపేందుకు వీలుగా పెయిడ్ పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేయాలని నగర పాలక, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చారిత్రక కోనేరుసెంటరును ఆహ్లాదంగా చూపర్లను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని, ఇందులో భాగంగా ఎటువంటి ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయకుండా నియంత్రించాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో రద్దీ సమయాల్లో పోలీసు అధికారుల పర్యవేక్షణ చేయడం ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించవచ్చన్నారు. రైతు బజారు సెంటరు వద్ద ట్రాఫిక్‌కు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వ్యాపారస్థులు, పేద వారిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు కలగకుండా నిబంధనల మేరకు ప్రధాన కూడళ్లల్లో అవసరమైన మేర విస్తరణ చేపట్టి ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రవీంద్రనాధ్ బాబు మాట్లాడుతూ నగర వాసులను ట్రాఫిక్ ఇబ్బందుల నుండి రక్షించేందుకు వీలుగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ మోకా సత్తిబాబు, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, నగర పాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.