శ్రీకృష్ణ లీలారింఛోళి

పరమేశ్వర శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. బిల్వపత్రాలతో నిన్నుఁ బిలిచినంత
జలములనుఁబోసి ఘనముగ స్వాగతింప
అష్టసంపదలొసగు మహానుభావ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ పార్వతీపతీ ! బిల్వపత్రాలతో నిన్ను పిలిచినా, జలాలు పోసి ఘనంగా నిన్ను స్వాగతించినా అష్టసంపదలిచ్చే మహానుభావుడవు నీవు హరా! నీకు జాజులు, మల్లెలు పెట్టలేదని అలుకసాధించవు. కేవలం మారేడుదళాలను నీపై వేసి శివా శంభోశంకరా అని స్మరిస్తచే చాలు నీవు ఏడేడు జన్మలల్లోని పాపాలను పోగొట్టి నీచెంత చోటిస్తావు .
తే. గీ. దేవదానవులనియెంచ ఁ బోవు నీవు
భక్తితో వేడ శీఘ్రమే వశుడవీవు
స్మరణ ఁజేసిన కరగిపోసాగు దేవ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ పార్వతీ పరమేశ్వరా! దేవతలని గాని, రాక్షసులని గానీ చూడకుండా భక్తితో నిన్ను వేడుకుంటే చాలు వెంటనే వశమైపోతావు నీవు. నిన్ను నమ్మినవారికి లేమి అనుమాట తెలియదు. ఎంతటి పాపాత్ముడైనా నీ సన్నిధిలో నిలిస్తే చాలు. నిన్ను నోరారా ఓ శివా! స్మరిస్తే చాలు. వెన్నలాంటి నీ మనసు కరిగిపోతుంది. వారిని కాపాడుతుంది.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262