కృష్ణ

నదీ తీర ప్రాంతాల్లో ఆర్డీవో పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి : కృష్ణానదికి వరద నేపథ్యంలో లంక గ్రామాల పరిస్థితిపై బందరు ఆర్డీఓ ఉదయ భాస్కర్ మంగళవారం సమీక్షించారు. తహశీల్దార్లు, పోలీసు అధికారులతో కలిసి నదీ పరీవాహక ప్రాంతంలో పర్యటించిన ఆయన చల్లపల్లి తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజిలో నీటి నిల్వ, నదిలో ఎంత మేర దిగువకు నీ రు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవా హం ఎంత ఉంటుంది, లంక గ్రామాలకు ఇబ్బందిపై సమీక్ష చేసిన ఆర్డీఓ అధికారులకు పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం చేసుకుంటూ లంక గ్రామాలలో నివసించే వారిని అప్రమత్తమై స్వగృహానికి చేరుకోవాలన్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది కొంత మందిని స్వగృహాలకు పంపించినట్లు తెలిపారు. నదీ తీర గ్రామాలలో మైక్ ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు నీటి విడుదలపై అధికారులకు దిశ నిర్ధేశం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక తహశీల్దార్ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నదీ పరీవాహక ప్రాంతంలోని సిబ్బందిని వారి వారి గ్రామాలలో ఉండాలని ఆదేశించామన్నారు. మిగిలిన సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. సమావేశంలో చల్లపల్లి, మోపిదేవి తహశీల్దార్లు కె స్వర్ణమేరి, పద్మ కుమారి, మండల ప్రత్యేక అధికారి డా. ఎంవి భార్గవ, ఎంపీడీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అంతటా హై అలర్ట్
కోడూరు, ఆగస్టు 13: కృష్ణానదికి వరదలు ఉగ్రరూపంలో వస్తున్న నేపథ్యంలో మండల పరిధిలోని కృష్ణా తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయటంలో అధికారులు నిమగ్నమయ్యారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తహశీల్దార్ లతీఫ్ భాషా, కార్యదర్శులు, వీఆర్‌ఓలు, పోలీసు సిబ్బంది, ఇరిగేషన్ అధికారులకు బాధ్యతలు కేటాయించి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఠాంఠాం వేయించారు. లంకల్లోకి పశువులను మేపుకునేందుకు వెళ్లరాదని, గొర్రెలను కూడా మేతకు వదల వద్దని సూచించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ కృష్ణానది తీరం వెంబడి కరకట్ట బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి గ్రామ సేవకులతో అక్కడ కాపలా కాయిస్తున్నారు.