కృష్ణ

అన్న క్యాంటీన్‌ల మూసివేత దుర్మార్గపు చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : అన్న క్యాంటీన్‌ల మూసి వేత దుర్మార్గపు చర్య అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీలను ప్రస్తుత వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం మూసి వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరంలోని మూడు స్థంభాల సెంటరు వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ధర్నా చేశారు. నిరసన వ్యక్తం చేయటంతో పాటు పేద వర్గాలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కక్షపూరిత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ బలగం విజయశేఖర్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

జల దిగ్బంధంలో రావిరాల
* కృష్ణానదికి పెరిగిన వరద
జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 16: కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో శుక్రవారం మండలంలోని పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముక్త్యాల, రావిరాల, వేదాద్రిల్లో కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. వరద నీరు ఎగదన్ని ఈ గ్రామాల పరిసరాలను ముంచేశాయి. రావిరాల పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. గురువారం రాత్రికే భారీగా వరద రావడంతో కృష్ణా నది పుష్కర ఘాట్ దాటుకుని రావిరాల గ్రామంలో ప్రవేశించింది. గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో 9 అడుగుల మేర నీరు పారుతోంది. నివాస గృహాలను సైతం వరద నీరు చుట్టుముట్టడంతో పోలీస్, రెవెన్యూ, మండల పరిషత్ అధికార యంత్రాంగం అప్రమత్తమై గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులకు అల్పాహారం, మంచినీరు, భోజన వసతి కల్పించారు. ముక్త్యాల కృష్ణా నది వరద ధాటికి విద్యుత్ స్తంభాలు, మంచినీటి పథకాలు మునిగిపోయాయి. పుష్కర ఘాట్‌ను దాటుకుని వరద గ్రామంలోకి ప్రవేశిస్తోంది. జగ్గయ్యపేట - ముక్త్యాల రహదారిలో గల చంద్రమ్మ కయ్య, కె అగ్రహారం వద్ద పాలేటి వంతెనపై భారీగా వరద నీరు ప్రవహించడంతోపాటు, ముక్య్తాల దొండపాడు గ్రామాల వద్ద రోడ్డుపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించి ముక్త్యాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుండి వచ్చిన వరద నీటిని వచ్చింది వచ్చినట్లు దిగువకు వదలడంతో కృష్ణా నది వరద మరింత ఉద్ధృతంగా మారింది. పులిచింతల నుండి 8.05 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. జయంతిపురం రహదారి, వేదాద్రి సబ్ స్టేషన్ వద్ద రహదారిపై భారీగా వరద నీరు పారడంతో ఈ గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రోడ్లపైనే పడవలు నడుపుతున్నారు. ముక్త్యాల , రావిరాల, జయంతిపురం, వేదాద్రి గ్రామాల పరిధిలో వరద నీటిలో చిక్కుకున్న పంట పొలాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇంకా వరద పెరిగితే కృష్ణా పరీవాహక గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ రావిరాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. జగ్గయ్యపేటకి చెందిన గణేష్ ఫెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని వరద బాధితులకు అందజేశారు.

ఎదురుమొండి దీవిలో చిక్కుకున్న తహశీల్దార్
నాగాయలంక, ఆగస్టు 16: వరద సహాయక చర్యల్లో పాల్గొన్న మండల తహశీల్దార్ మద్దినేని వెంకట్రామయ్య శుక్రవారం సాయంత్రం మండలంలోని ఎదురుమొండి దీవిలో చిక్కుకున్నారు. సహాయ చర్యలను పర్యవేక్షించే నిమిత్తం సాయంత్రం తహశీల్దార్ ఎదురుమొండి దీవికి వెళ్లిన ఆయన నాచుగుంట, ఏసుపురం గ్రామాల్లో సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.
ఈ పరిస్థితుల్లో వరద ఉధృతి తగ్గకపోవటంతో ఆయన తిరిగి ఎదురుమొండి-ఏటిమొగ మధ్య గల కృష్ణానది పడమటిపాయను దాటేందుకు అవకాశం లేక అక్కడే ఉండిపోవల్సి వచ్చింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు తహశీల్దార్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.

అన్న క్యాంటీన్ మూసివేతకు నిరసనగా ధర్నా
మైలవరం, ఆగస్టు 16: అన్న క్యాంటీన్ల మూసివేతనకు నిరసనగా శుక్రవారం తెలుగు తమ్ముళ్ళు మైలవరంలో ఆందోళన చేపట్టారు. శుక్రవారం స్థానిక అన్న క్యాంటీన్ ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు మాట్లాడుతూ నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్‌లను మూసివేయటం శోచనీయమన్నారు. ఈపధకం ద్వారా కోటి 30 లక్షల మంది నిరుపేదలు ఆకలి తీర్చుకుంటున్నారన్నారు. అన్న క్యాంటీన్‌లను వెంటనే తెరిచి నిరుపేదల ఆకలి తీర్చాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా నిరుపేదలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఎన్ని కేసులు పెట్టి వేధించినా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపిపి లక్ష్మి, నేతలు గంజి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లెల రాధాకృష్ణ, కార్యదర్శి బాలకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ షహానాబేగం, రుక్మిణి, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.

లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి
* ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, పార్థసారధి
తోట్లవల్లూరు, ఆగస్టు 16: లంక గ్రామాల ప్రజలు వరద తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. శుక్రవారం మండలంలోని నదీ పరిసరా ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు వచ్చి చేరుతున్నందున ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల పెరుగుతోందని తెలిపారు. ప్రజలు నదీ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద తీవ్రత పెరిగితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వారు భరోసా ఇచ్చారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోందని వివరించారు. ప్రజలు సైతం అధికారులకు సహకరించి వారి సూచనలు పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ లంక ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని తెలిపారు. ఎన్‌డిఆర్‌ఏఫ్ బృందలు వచ్చాయని, వరద పోటుతో ఇబ్బంది పడుతున్న గ్రామాల ప్రజలను సురక్షితంగా బోటుల ద్వారా తరలిస్తారని తెలిపారు. వారికి పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామని, వరద ఉధృతి తగ్గేవరకు వారు అక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా అధికారులను సంప్రదించాలని చెప్పారు. తహశీల్దార్ జి దుర్గాప్రసాద్, మాజీ ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, మండల వైసిపి కన్వీనర్ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.