కృష్ణ

సమగ్ర సర్వేపై సీఈఓ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు : గ్రామ పంచాయతీ వలంటీర్లు చేస్తున్న కుటుంబ సమగ్ర సర్వేపై జిల్లా పరిషత్ సిఇఒ షేక్ సలామ్ తనిఖీలు చేశారు. జి.కొండూరు ఎంపిడిఒ అనురాధతో కలసి జి.కొండూరులోని సర్వే సరళిని పరిశీలించారు. ఇంటింటికీ వెళ్ళి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసే బుక్‌లెట్లు పరిశీలించారు. వలంటీర్లకు 50 కుటుంబాల చొప్పున కేటాయించారు. వీరు ఆగస్టు 15న విధుల్లో చేరారు. వీరు చేస్తున్న సర్వేని బట్టి ప్రభుత్వ పథకాలను వర్తింపచేయనున్న నేపథ్యంలో సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల జీవన స్థితిగతులు, ఆస్తులు, వారి ఆదాయ వనరులు మొత్తం 13 రకాల అంశాలపై సర్వే చేస్తున్నారు. మండలంలో మొత్తం 298 మంది వలంటీర్లకు గానూ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చేరిన 34 మందిని తొలగించామని సిఇఒ సలాం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారిని, చదువుకుంటున్న వారిని తొలగించామన్నారు. మండలంలో 14,900 కుటుంబాలకు సంబంధించి సర్వే చేస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 16 వేల వలంటీర్లను నియమించాల్సి ఉందన్నారు. జిల్లాలో 2.55 లక్షల కుటుంబాలు ఉన్నాయన్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడానికి చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే శిక్షణ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఎంపిడిఒ అనురాధ, ఇఒపీఆర్డీ రాధిక, కార్యదర్శి రమణ పాల్గొన్నారు.