కృష్ణ

వరద నీటిలో మునిగిన పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు : పులిచింతల నుండి 6 లక్షల క్యూసెక్కులకు పైగా వస్తున్న వరద నీరు మండలంలోని ఉస్తేపల్లి, కాసరబాద, కొడవటికల్లు, పున్నవల్లి, సంగళ్లపాలెం, ఏటూరు గ్రామాలను చుట్టుముట్టింది. గ్రామాలలో నీరు రోడ్డుపైకి పొంగటంతో పడవలపై గ్రామాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వేసిన మిరప, పత్తి, పసుపు పంటలు నీట మునిగాయి. ఈ సంవత్సరం వర్షాలు లేక అదును దాటి పంటలు వేయగా ఇప్పుడు వేసిన పంట కాస్త నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాలలో అధికారులు పర్యటించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నారు.

లంక గ్రామాలను సందర్శించిన సీపీ ద్వారాకాతిరుమలరావు
తోట్లవల్లూరు, ఆగస్టు 17: కృష్ణానదీకి ఉధృతంగా వరద నీరు వస్తుండటంతో వాటి పరిసర ప్రాంతాలను పరిశీలించేందుకు విజయవాడ సీపీ ద్వారాకాతిరుమలరావు, డిసిపి వి హర్షవర్థన్ శనివారం వచ్చారు. లంక ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాములలంక గ్రామం వరద ముంపునకు గురవ్వటంతో ఆ గ్రామాన్ని ఎన్‌డిఆర్‌ఎ టీంతో పడవలో వెళ్ళి పరిశీలించారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారని, సిబ్బంది జాగ్రత్తగా ఉండి ఎవ్వరినీ నదిలోకి పోనివ్వవద్దని పోలీసులకు సూచించారు. సిపి వెంట ఉయ్యూరు సిఐ నాగప్రసాద్, తోట్లవల్లూరు ఎస్‌ఐ చిట్టిబాబు, ఇంకా పలువురు అధికారులు ఉన్నారు.

నీట మునిగిన పులిగడ్డ ఆక్విడెక్ట్
అవనిగడ్డ, ఆగస్టు 17: వరద నీటి ఉధృతికి పులిగడ్డ ఆక్విడెక్ట్ నీట మునిగింది. ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు లక్షలాది క్యూ సెక్కుల వరద నీటిని విడుదల చేయటంతో గత రెండు రోజులుగా వరద నీటి ప్రవాహంలో తేలియాడుతున్న ఆక్విడెక్ట్ శనివారం ఉదయం పూర్తిగా నీట మునిగింది. అలాగే పులిగడ్డ ఎత్తిపోతల పథకం కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. పులిగడ్డ వరద నీటి ప్రవాహాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పులిగడ్డ వంతెన మీద నుండి ఆక్విడెక్ట్ వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. లంకమ్మమాన్యం, రాజశేఖరపురం కాలనీలకు ముప్పు పొంచి ఉండటంతో అవనిగడ్డ-నాగాయలంక ప్రధాన పంట కాలువ కాలిబాట వంతెన సమీపాన కాలువ గట్టు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. రైతులు ఇసుక బస్తాలు వేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. పాత ఎడ్లలంక, 7వ వార్డు కరకట్ట వద్ద వరద ఉధృతి కారణంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు నీట మునిగాయి. ఈ కేంద్రాల్లో విలువైన యంత్రాలను బయటకు తీయకపోవటం వల్ల నీట మునిగిపోయాయి. పులిగడ్డలో ఎత్తిపోతల పథకం నీట మునిగింది.