కృష్ణ

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : కృష్ణానదికి వరద పోటెత్తటంతో ముంపుకు గురైన పాత ఎడ్లలంక గ్రామంలో రాష్ట్ర మంత్రులు అనీల్ కుమార్ యాదవ్, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి వేంకటేశ్వరరావు (నాని), స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ శనివారం పర్యటించారు. పడవ ద్వారా గ్రామంలోకి వెళ్లిన మంత్రులు వరద ప్రభావంతో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ప్రజలను క లిసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ పర్యటనలో బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కర్, వైసీపీ జిల్లా కార్యదర్శి కడవకొల్లు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, గ్రామీణ వికాస సమితి అధ్యక్షుడు మండలి రాజా తదితరులు వరద ముంపు గ్రామాల్లో పర్యటించారు. అధికారులు చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు.