కృష్ణ

రైతులకు సంజీవని పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు, ప్రజలకు పోలవరం ప్రాజెక్టు సంజీవనిలాంటిదని, ఈ పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాల్సింది పోయి అడ్డంకులు పెట్టి నిలిపివేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని పెనమకూరులో ఆదివారం మండల టీడీపీ అధ్యక్షుడు వీరపనేని శివరామప్రసాద్ నిర్వహించిన దివంగత నందమూరి హరికృష్ణ ప్రధమ వర్థంతి కార్యక్రమానికి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ హాజరై హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అమరావతి, పోలవరం రెండు కళ్లుగా భావించి వాటి అభివృద్ధికి విశేషకృషి చేశారని, కాని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని విస్మరించిందని అన్నారు. పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వమే క్లిన్‌చిట్ ఇస్తే, లేదు అవినీతి జరిగిందని ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగా ఉందని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌తో జతకట్టి గోదావరి నీళ్లు శ్రీశైలానికి తరలించాలని చూస్తున్నాడని తెలిపారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు వదులుతుంటే , పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రావాళ్ళు పరిమితికి మించి నీళ్లు ఎత్తుకు వెళుతున్నారని, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్‌మోహన్‌రెడ్డి పద్ధతి మార్చుకుని గోదావరి నీళ్ళు శ్రీశైలానికి తరలించటాన్ని విరమించుకోవాలని చెప్పారు. ఎగువ రాష్ట్రాల నుంచి విపరీతమైన వరద వస్తుంటే దానిని వారం రోజుల ముందే మానిటరింగ్ చేయాల్సిందిపోయి ఆయన అమెరికాకు విహారయాత్రకు వెళ్లాడని విమర్శించారు. ఇరిగేషన్ అధికారులు వరద విషయం వదిలేసి గోదావరి నుంచి శ్రీశైలం వెళ్ళటానికి కాలువలు ఎలా తవ్వాలో మ్యాప్‌లు రెడీ చేస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నివాసం ఏ విధంగా ముంచాలో ఆలోచనాలు చేస్తున్నారని తెలిపారు. వారికి రైతులు, ప్రజలు కష్టాలు పట్టవు అని, వారి అనాలోచన విధానాల వల్లే లంక పోలాలు అన్ని వరద ముంపునకు గురై రైతులు అందరు పంట నష్టపోయారని పేర్కొన్నారు. అధికారులు, ప్రభుత్వం కరెక్టుగా పనిచేసి ఉంటే ముందుగానే 2,3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుకుంటూపోతే ఎవరికి ఎటువంటి నష్టం జరిగేది కాదని తెలిపారు. ఈ వరద హఠాత్తుగా రావటానికి మన రాష్ట్రంలో వర్షాలు పడి వాగులు పొంగి వచ్చిన వరద కాదని, ఇది ఎగువ రాష్ట్రాల నుంచి డ్యామ్‌లన్నీ నిండిపోయి వచ్చిన వరద అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన, వల్లభాపురపు జగదీష్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.