కృష్ణ

ప్రజాసమస్యల పరిష్కారమే జనసేన అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా జనసేన పార్టీ కార్యకలాపాలు ఉంటాయని ఆ పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ అన్నారు. ఇటీవల మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ సమీక్షా సమావేశంలో బందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన బండి రామకృష్ణ అభినందన సభను ఆదివారం సాయంత్రం ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నిస్వార్ధమైన ప్రజా సేవ చేసేందుకు జనసేన పార్టీ అవిర్భవించిందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంతో పాటు వారి బాగోగులు చూసుకుంటామన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా జనసేన పార్టీ అక్కడ ఉంటుందన్నారు. గ్రామ గ్రామాన, వార్డు వార్డున పార్టీని పటిష్ఠపర్చి రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ గత ఎన్నికల్లో జనసేనకు 15 శాతం ఓట్లు ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. కుల, మతాలకు అతీతంగా జనసేన ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నాయకుడు వంపుగడల చౌదరి, బీసీ సెల్ నాయకుడు గడ్డం రాజు, వీర మహిళ నాయకురాలు వరుదు రమాదేవి, ఘంటా శ్రీనివాస్, చక్రి, వంశీ, రమేష్, చిరంజీవి, రాజేష్, శ్రీకాంత్, మోకా రవి, కొండ, వీర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

‘అమ్మసేవ’ ట్రస్టు సేవలు
అభినందనీయం*సీఐ రమేష్
గుడివాడ, ఆగస్టు 18: అమరావతి వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎవీజెఎ) అమ్మసేవ ట్రస్ట్ సేవలు అభినందనీయమని గుడివాడ టూటౌన్ సీఐ ఎల్ రమేష్ అన్నారు. అమ్మసేవ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బేతవోలులోని శాంతి వృద్దాశ్రమం, ఎయిమ్ ఫర్ సేవలో వృద్ధులు, అనాధ బాలలకు అన్నదానం చేశారు. సుమారు 60 మందికి అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ రమేష్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదన్నారు. అమ్మసేవ ట్రస్టు సభ్యులు సేవాధృక్పధంతో ప్రతి నెలా తలాకొంత వేసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న వృద్దాశ్రమాలు, అనాధ బాలల ఆశ్రమాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో తాను భాగస్వామినైంనందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మసేవ ట్రస్టుకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మసేవ ట్రస్టు సభ్యులు పి సాంబశివరావు (పండు), అంబటి శేషుబాబు, డి వినయ్ కుమార్, గుడివాడ టూటౌన్ సర్కిల్ పోలీసు స్టేషన్ సిబ్బంది మునికుమార్, గణేష్, రామకృష్ణ, బాలాజీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
‘జక్కా’ అంత్యక్రియల్లో మంత్రి పేర్ని, ఎమ్మెల్యే జోగి
గూడూరు, ఆగస్టు 18: గుండెపోటుతో మృతి చెందిన పెడన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జక్కా అర్జున భాస్కరరావు అంత్యక్రియలను ఆదివారం ఆయన స్వగ్రామమైన తరకటూరు గ్రామంలో నిర్వహించారు. రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్ అర్జున భాస్కరరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇరువురు నేతలు స్వయంగా అర్జున భాస్కరరావు కాడిని మోసారు. అర్జున భాస్కరరావు మృతి వైఎస్‌ఆర్ సీపీకి తీరని లోటని పేర్ని, జోగి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు అంబటి కాంతారావు, బూరగడ్డ శ్రీకుమార్, జనసేన నాయకుడు అంకెం లక్ష్మీ శ్రీనివాస్, వైసీపీ నాయకులు కెవి కృష్ణ, సంగా మధు తదితరులు పాల్గొన్నారు.

చెరువుమాధవరంలో సర్వే పరిశీలన
జి.కొండూరు, ఆగస్టు 18: మండల పరిధిలోని చెరువుమాధవరంలో గ్రామపంచాయితీ వలంటీర్లు చేస్తున్న సర్వేను ఎంపీడీఓ అనురాధ, ఇఓపీఆర్డీ రాధిక, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ నవీన్‌కుమార్‌లు పరిశీలించారు. సర్వే జరుగుతున్న విధానంపై ఆరాతీశారు. వలంటీర్లు 13 రకాల అంశాల గురించి సర్వే చేస్తున్నారని వివరించారు. వలంటీర్లు కుటుంబాల వద్దకు వెళ్ళి వారి ఆస్తుపాస్తులు, ఆదాయం, ప్రభుత్వ పథకాల గురించి వాకబు చేసి సర్వే పత్రాల్లో నమోదు చేస్తారు. సర్వేను పకడ్బందీగా నమోదు చేయాలని ఎంపీడీఓ ఆదేశించారు.