కృష్ణ

విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని బందరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి బి సత్యనారాయణమూర్తి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. సోమవారం ఆయన స్థానిక రుస్తుంబాదలోని పాండ్రాక పున్నమ్మ సాహెబ్ మున్సిపల్ యుపీ స్కూల్‌లో మిడ్డే మీల్స్ నిర్వహణను ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిడ్డే మీల్స్ పథకానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు తయారు చేసి విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఇఓ కార్యాలయ ఐటీ సెల్ సూపరింటెండెంట్ పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

‘స్పందన’ సంతృప్తికరంగా ఉండాలి
* కలెక్టర్ ఇంతియాజ్

మచిలీపట్నం, ఆగస్టు 19: ‘స్పందన’ సంతృప్తికరమైన పరిష్కార చర్యలు చూపాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలతతో కలిసి ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు. స్పందనలో వచ్చే అర్జీలను నామ్‌కే వాస్తే అన్న చందంగా కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కార చర్యలు ఉండాలన్నారు. అర్జీదారుడిని నేరుగా సంప్రదించి అతని సమస్యపై కూలంకషంగా పరిశీలన చేయాలన్నారు. స్పందన అర్జీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లాల వారీగా సమీక్షిస్తున్నారన్నారు. సంతృప్తి శాతం పెంచి తిరస్కరణ శాతాన్ని గణనీయంగా తగ్గించాలన్నారు. జిల్లాలో 8.8శాతం అర్జీలు తిరస్కరణకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్పందన సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 మోహనకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ అంజలి అనుపమ, జెడ్పీ సీఇఓ షేక్ సలాం, ఆర్డీవో జె ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.