కృష్ణ

వరదకు నష్టపోయిన ప్రతి ఎకరాకూ పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. దివిసీమలోని వరద ప్రభావిత ప్రాంతాలైన మోపిదేవి మండలం కె.కొత్తపాలెం, అవనిగడ్డ పులిగడ్డ ఆక్విడెక్ట్‌లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ వరద బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు తయారు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రైతుల కోసం ఎటువంటి సహాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని రైతులకు న్యాయం చేస్తామన్నారు. గోదావరి, కృష్ణా రెండు నదులకు ఎగువున కురిసిన వర్షాలకు ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోవటంతో పరివాహక ప్రాంతాలు నీటితో నిండాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఒక పక్క పన్నీరు మరో పక్క కన్నీరుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన వేళ ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. ప్రాజెక్టులు నిండటం శుభ సూచికమన్నారు. జిల్లాలో 25వేల ఎకరాల్లో వ్యవసాయం, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా నిబంధనల ప్రకారం అందించనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు ఇన్‌పుట్ సబ్సిడీకి ఎటువంటి సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో ఉందన్నారు. పసుపు, కంద, అరటి, తమలపాకు వంటి వాణిజ్య పంటలు ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నారన్నారు. పెట్టుబడులు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ ఎకరాకు రూ.75వేలు నుండి రూ.1.25లక్షల వరకు రైతులకు పెట్టుబడిగా ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వమిచ్చే సబ్సిడీ నిబంధనల మేరకు ఎకరానికి రూ.6వేలు నుండి రూ.10వేలు లోపే ఉంటుందన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టిలో పెట్టి పరిహారం పెంచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మినుము, పెసలు విత్తనాలు సబ్సిడీతో అందించాలని కోరుతున్నారని, వీటిని నూరు శాతం సబ్సిడీపై ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. మొక్కజొన్న విత్తనాలను ఏ ధరకు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదికి అన్ని పంటలు ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. లంక భూములను సొసైటీల కింద సాగు చేస్తున్నారని, వారికి భూమిపై హక్కులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. తొలుత మండల పరిధిలోని పసుమట్ల గ్రామానికి చెందిన 75 మంది వరద బాధిత కుటుంబాలకు మంత్రి కన్నబాబు చేతుల మీదుగా 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, పామాయిల్ ప్యాకెట్, రెండున్న లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, వైసీపీ జిల్లా కార్యదర్శి కడవకొల్లు నరసింహరావు, మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.