కృష్ణ

వరదలను రాజకీయం చేయడం బాధాకరం: మంత్రి కన్నబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి : వరదలను సైతం రాజకీయం చేయడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన మండల పరిధిలోని కె.కొత్తపాలెం ముంపు ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వరదలను మనుషులు సృష్టించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం గేట్లు, లాకులకు మరమ్మతులు చేట్టకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి జలాలను విజయవంతంగా వినియోగించుకుంటున్నామన్నారు. పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ తమది రైతు ప్రభుత్వమన్నారు. సొసైటీదారులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీవో జె ఉదయ భాస్కర్, వ్యవసాయ శాఖ ఎడీఎ వెంకట మణి, వైసీపీ జిల్లా కార్యదర్శి కడవకొల్లు నరసింహరావు, మోపిదేవి మండల కన్వీనర్ దుట్టా శివరాజయ్య, అవనిగడ్డ మండల కన్వీనర్ రేపల్లి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి లింగం జగదీష్ కుమార్, పీఎసీఎస్ అధ్యక్షుడు కోసూరు కోటేశ్వరరావు, పార్టీ నాయకులు కోసూరు శివాజీ, కోసూరు శివ నాగ మల్లేశ్వరరావు, బండారు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.