కృష్ణ

నష్టపోయిన ప్రతి రైతును, కుటుంబాలను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు : కృష్ణా నది వరద తాకిడికి నష్టపోయిన ప్రతి రైతుకు, కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వరద బాధితులకు భరోసా ఇచ్చారు. బుధవారం మండలంలోని రొయ్యూరు నుంచి ఐలూరు వరకు నదీ పరీవాహక ప్రాంతాలను మంత్రి కన్నాబాబు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి తదితరులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా తోట్లవల్లూరులో వరద ముంపునకు గురై నష్టపోయిన రైతులతో మంత్రి మాట్లాడారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ఉచిత పంట బీమా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని, రైతు ఒక్క రూపాయి చెల్లిస్తే, మిగతా మొత్తం పంట బీమా కింద రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకానికి రూ.2163 కోట్లు కేటాయించారని తెలిపారు. ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టారన్నారు. అదే కాకుండా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ ఒక్క రైతు నష్టపోకుండా విపత్తు నిధి కింద 2 వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించారని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, లెక్కలు వేసి వేసి 23 వేల కోట్లకు తెచ్చారని, ఇచ్చింది 15 వేల కోట్లు అని, మిగతా 8 వేల కోట్లు జగన్‌మోహన్‌రెడ్డి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. లంకలో ఎన్ని సొసైటీ భూములు ఉన్నాయో వాటి నివేదిక వెంటనే ఇవ్వాలని అధికారులను కోరానని, ఆ నివేదికను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. రైతులకు పెట్టుబడుల సహాయం రూ.12,500, ఉచిత బీమా సౌకర్యం, ఉచిత బోర్లు కల్పించబోతున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ తరఫున అధికారులతో కలిసి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని తెలిపారు. మినుము, పెసర విత్తనాలను 100 శాతం సబ్సిడీపై అందిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఎవరెన్ని విమర్శలు చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మా పని మేము చేసుకుంటూపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి, వైసీపీ మండల కన్వీనర్ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, గొరిపర్తి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.