కృష్ణ

లోక్ ఆదాలత్ విజయవంతానికి సమష్టి కృషి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జాతీయ లోక్ ఆదాలత్‌ల విజయవంతంలో సమష్టి సహకారం అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ భీమారావు కోరారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 22వతేదీన జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహణపై గురువారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ ద్వారా పరిష్కరించదగ్గ కేసులను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో చాలా వరకు రాజీ ద్వారా పరిష్కరించేవి ఉంటాయన్నారు. వాటిని గుర్తించి లోక్ ఆదాలత్ నిర్వహణలో జిల్లాను అగ్రపథాన నిలిపేందుకు కృషి చేయాలన్నారు. లోక్ ఆదాలత్ ప్రజాకోర్టు లాంటిదన్నారు. కక్షిదారులు వారికి ఇష్టమైన రీతిలో రాజీకి వచ్చి వారి కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ద్వేషం గల వ్యక్తి రోగితో సమానమన్నారు. ద్వేషాలు, కక్షలు పక్కన పెట్టి రాజీకి వచ్చి కేసులు పరిష్కరించుకుంటే జీవితం సుఖమయం అవుతుందన్నారు. ఈ విషయాల పట్ల ప్రజల్లో అవగాహన మరింత పెంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్, 10వ అదనపు జిల్లా జడ్జి ఎస్ రజనీ, 6వ అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్వరరెడ్డి, పర్మినెంట్ లోక్ ఆదాలత్ అధ్యక్షుడు పుండరీకాక్షుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సాగునీరు లేక బీడు పడుతున్న వ్యవసాయ భూములు
నాగాయలంక, ఆగస్టు 22: మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ భూములు సాగునీరు అందక బీడుగా మారుతున్నాయి. గత మూడు సంవత్సరాల వరకు జూన్‌లో సాగునీరు విడుదల కాగా జూలై ఆఖరి వారంలో వరి నాట్లు వేసిన రైతాంగానికి ఈ ఏడాది అందుకు విరుద్ధంగా సకాలంలో సాగునీరు అందక పలు ఇక్కట్లకు గురవుతున్నారు. వారం రోజులు పాటు కృష్ణానదికి వరద ఉధృతితో లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలు కాగా మరోవైపు పులిగడ్డ క్యాంబెల్ ఆక్విడక్టు పరీవాహక ప్రాంతంలో భాగంగా ఉన్న నాగాయలంక మండలంలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. కాలువకు సాగునీరు కొద్ది రోజులు పాటు వంతులు వేయగా దిగువ గ్రామాలకు చెందిన రైతులు నారుమడులు పోసుకునే అవకాశం లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ కాలువకు సాగునీరు విడుదలవుతున్న పరిస్థితుల్లో కూడా దిగువ భూములకు చెందిన రైతులు ఆయిల్ ఇంజన్‌ల సహాయంతో నారుమడులు తడుపుకునే దుస్థితి ఉంది. ఆగస్టు నెల పూర్తి కావస్తున్న తరుణంలో కూడా సార్వా వరి నాట్లకు అవసరమైన పరిస్థితులు లేకపోవటంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో పంట చేతికివచ్చే బీపీటీ వరి వంగడాలను సాగు చేస్తున్న రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు నాట్లు వేస్తామోనన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలోని వ్యవసాయ భూములకు అవసరమైన సాగునీటిని పుష్కలంగా అందించాలని రైతులు కోరుతున్నారు.

బెంగాలీలచే వరినాట్లు
నాగాయలంక, ఆగస్టు 22: మండలంలో పలు గ్రామాలకు చెందిన రైతులు మహిళలకు బదులుగా పురుషులతో వరి నాట్లు వేయించటం చర్చనీయాంశమైంది. బెంగాల్‌కు చెందిన వ్యవసాయ కార్మికులను ఇందుకు వినియోగించటం జరుగుతోంది. వ్యవసాయ పనుల్లో ప్రధానమైన నారు తీత, వరి నాట్లు వంటి పనులకు వీరిని ఉపయోగించటం గమనార్హం. ఈ విధంగా పురుషులతో వరి నాట్లు వేయిస్తున్న గుంటూరు శ్రీనివాసరావు, బండ్రెడ్డి వెంకటేశ్వరరావు గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ స్థానిక మహిళలు అయితే ఎకరాకు 50 నుంచి 60 పోగుల నారు వినియోగిస్తున్నారని, బెంగాల్‌కు చెందిన కార్మికులు 12 నుంచి 15 పోగులతోనే నాట్లను పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఇందుకు ఎకరాకు రూ.3,500 ఖర్చు అవుతుందని వారు తెలిపారు. ఈ విధంగా వరి నాట్లు వేస్తున్న విధానం వల్ల వరి పైరులో చీడ పీడలు రాకుండా నిరోధించే వీలుందని, దిగుబడులు కూడా పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ వరి నాట్ల విధానం పట్ల పలువురు ఆకర్షితులై వారు కూడా బెంగాల్‌కు చెందిన కార్మికులను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.