కృష్ణ

పోషకాహార పథకం అమలులో కృష్ణాకు దక్కిన జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : జాతీయ పోషకాహార కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరాని చేతుల మీదుగా జాతీయ పోషణ అభియాన్ అవార్డును అందుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్‌తో పాటు జిల్లా స్ర్తి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి కృష్ణకుమారి, విస్తరణాధికారిణి ఎస్ సునీతాదేవి, గతంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పనిచేసిన డా. ఐ రమేష్ ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ పోషకాహార కార్యక్రమం అమలులో జిల్లా సత్ఫాలాలు సాధించింది. జిల్లాలోని 26 ప్రాంతాల్లో కన్వర్జెన్సీ యాక్షన్ సమావేశాలను నిర్వహించి పోషణ అభియాన్‌పై నూరు శాతం అవగాహన కల్పించారు. కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ నూరు శాతం నిర్వహించారు. అలాగే నూరుశాతం ఇమ్యునైజేషన్ కార్యక్రమాల నిర్వహణను పరిగణలోకి తీసుకుని ఈ జాతీయ స్థాయి అవార్డులను కేంద్రం అందజేసింది. జిల్లాలో ఆరు నెలల కాలంలో రక్తహీనతను ఆరు శాతం నుండి 0.5శాతానికి తగ్గించడం పోషకాహార లోపాన్ని నివారించటంతో పాటు జిల్లాలో 5.04 శాతం మంది పిల్లలు మాత్రమే తక్కువ బరువుతో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అంతేకాకుండా జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నూరు శాతం గ్యాస్ కనక్షన్‌లు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించడం, జిల్లాలో రసాయన పురుగు మందులను వినియోగించకుండా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించేలా 249 న్యూట్రీ గార్డెన్లు అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు లభించినట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలియజేశారు.