కృష్ణ

మీ వల్ల కాకుంటే అక్రమ తూములను మేమే పగుల కొడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, : మొవ్వ మండలంలోని బార్లపూడి బ్రాంచ్ కాలువకు సాగునీరు విడుదల చేయకపోతే ఇరిగేషన్ శాఖపై తీవ్ర ఆందోళన చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు ఇరిగేషన్ శాఖాధికారులను హెచ్చరించారు. బార్లపూడి ఛానల్ పరిధిలోని వేములమడ, మొవ్వపాలెం, చిలకలపూడి, వెల్లువిల్లి, రుద్రవరం, కేటీపాలెం ప్రాంతాలలోని 500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు సరఫరాకు ఆటంకంగా ఉన్న తూములను పగులగొట్టి తాము సాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామని తూర్పు కృష్ణా రైతు సంఘం నాయకుడు ఆర్ రఘు, పామర్రు డివిజన్ కన్వీనర్ చేబ్రోలు భాస్కరరావు, మొవ్వ మండల కార్యదర్శి శీలం ప్రకాశరావు వీరంకి సెక్షన్ ఎఇ అబ్దుల్ కరీమ్‌ను హెచ్చరించారు. గతంలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, కౌలు రైతులు సాగునీటి కోసం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవటంతో శుక్రవారం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు ఆధ్వర్యంలో లాకు తలుపులు పగులగొట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖ ఎఇ అబ్దుల్ కరీమ్ వేములమడ గ్రామానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీటికి అడ్డంగా ఉన్న తూములకు గండిపెట్టి సాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపడతానని రఘుకు హామీ ఇచ్చారు. రఘు మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాలలో అధిక వర్షాలు కారణంగా కృష్ణా, గోదావరి నదులు పొంగి గ్రామాలను ముంచెత్తుతుంటే వరద నీటిని సముద్రంలోకి విడుదల చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులు కాలువలకు ఎందుకు సరఫరా చేయటం లేదని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాలకులకు సరైన సమాచారం ఇవ్వకపోవటంతో ఈ సమస్య ఎదురైందని, ఇప్పటికైనా ముంపు నీటిని సక్రమంగా కాలువలకు, డ్రైన్‌లకు విడుదల చేయాలని ఆయన సూచించారు. కూరపాటి కృష్ణమూర్తి తదితరులు పాదయాత్ర చేసి ఎఇకి వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ, అసైన్డ్ భూములపై
పేదలకు శాశ్వత హక్కు కల్పించాలి
* వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిర్మల
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 23: దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం పేరుకుపోయిన భూ సమస్యలకు తక్షణ ప

వరద బాధితులను ఆదుకుంటాం
* డెప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి
విజయవాడ : కృష్ణానది ఉగ్రరూపానికి బాధితులగా మారిన వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. నగరంలోని కృష్ణానది కరకట్ట ప్రాంతాల్లో మంత్రి నారాయణ స్వామి శుక్రవారం పర్యటించారు. కృష్ణాలంక ప్రాంతంలోని 14, 15, 16 డివిజన్లలో మంత్రి నారాయణ స్వామి, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొప్పన భవకుమార్ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌తో కలిసి పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు అన్ని సహాయాలు అందే విధంగా చూస్తానన్నారు. 13వ డివిజన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఎదురెళ్లి ఇళ్ల సమస్యను పరిష్కరించాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్లు ఇస్తామని చెప్పి లక్ష రూపాయలను కట్టించుకున్నారని ఇప్పుడు దానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కూడా సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. సీఎం జగన్ ద్వారా నైనా న్యాయం చేయాలన్నారు. అలాగే 15వ డివిజన్ వద్ద వరద బాధితులకు మంత్రి రేషన్ అందించారు. వీటితో పాటు 22వ డివిజన్‌కు చెందిన కుంచ సత్యనారాయణ బ్రెయిన్ ట్యూమర్ సమస్యకు సంబంధించి ఆపరేషన్ కోసం అవసరమైన ఖర్చు 90 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంత్రి నారాయణ స్వామి అందించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పరిపాలనలో టంగుటూరి స్ఫూర్తి
మంత్రి వెల్లంపల్లి
లబ్బీపేట, ఆగస్టు 23: విలువలతో కూడిన పాలన అందించిన టంగుటూరి ప్రకాశం పంతులు మనకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 147వ జయంతి సందర్భంగా శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు కాంస్య విగ్రహానికి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శాసన సభ్యులు మల్లాది విష్ణు, ఇన్‌చార్జి, కలెక్టర్ మాధవీలత, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నీతి నిజాయతీ కలిగిన మంచి పాలన అందించారన్నారు. సహాయనిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని సైమన్ కమిషన్ బహిష్కరణ సందర్భంగా బ్రిటిష్ వారికి తనగుండె చూపి కాల్చమని ఎదురునిలిచారన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా కృష్ణానదిపై బ్యారేజ్‌కు ప్రకాశం బ్యారేజ్‌గా నామకరణం చేశారన్నారు. ఆయన అందించిన నీతి, మంచి విలువలు, నిజాయితిని ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తున్నారన్నారు. మంత్రిగా ఉన్నప్పడు ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి అన్నారు. శాసన సభ్యుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతికశాఖ ఘనంగా నిర్వహిస్తున్నాయన్నారు. తొలి ముఖ్యమంత్రిగా నీతివంతమైన పాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్ కె మాధవీలత, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, తహశీల్దార్లు రవీందర్, సుగుణ, ఆర్‌ఐ వెంకటేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా వరలక్ష్మీ వ్రతం
ఇంద్రకీలాద్రి, ఆగస్టు 23: ఇంద్రకీలాద్రిపై కనకకదుర్గమ్మ సన్నిధిలో శ్రావ ణ శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని అర్చకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ మల్లికార్జు న మహామండపం 6వ అంతస్తులో అ మ్మవారి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేశా రు. దేవస్థానం స్థానాచార్యుడు స్వ యంగా దుర్గగుడి ఈవో సురేష్‌బాబు దంపతుల చేత విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మండపారాథన వైదిక కార్యక్రమాలను చేయించారు. మండపంలో మహిళ భక్తులను 4సార్లు లైనులో కూ ర్చోబెట్టారు. అనంతరం వరలక్ష్మీ వ్రతా న్ని చేయించారు. ఉదయం రూ. 1500 టిక్కెట్ అర్జిత సేవగా నిర్వహించగా ఉదయం 11గంటలకు సుమారు 500 మంది మహిళలను కూర్చొబెట్టి వారి చేత సామూహికంగా ఉచితంగా ఈవరలక్ష్మీ వ్రతాన్ని చేయించారు. వ్రతం అనంతరం వీరికి దేవస్ధానం ఆధ్వర్యంలో ఉచితంగా అమ్మవారి ప్రసాదాలను పంపిణీ చేశారు.
మల్లేశ్వరస్వామి ఆలయంలో..
ధర్మరాజు నిర్మించిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాం గణంలో ఉదయం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ప్రధాన అర్చకుడు ని ర్వహించారు. శ్రావణ శుక్రవారం కావటంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తిని ఉంచారు. ప్రధాన అర్చకుడి ఆధ్వర్యంలో అలయ అర్చకులు నాగరాజు శర్మ, రాఘవేంద్రశర్మ తదితరులు ఆలయ ఈవో దంపతుల చేత విఘ్నేశ్వర పూజ, కలశస్థాపన, వివిధ రకాలైన ప్రత్యేక పూజలను చేయించి అనంతరం వరలక్ష్మీ వ్రతాలను చేయించారు. దేవస్ధానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈకార్యక్రమంలో 108 మంది పుణ్య స్ర్తిలు పాల్గొని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకున్నారు.
కంకిపాడులో వాసవీమాతకు పల్లకిసేవ
కంకిపాడు : కంకిపాడులోని ఆర్యవె శ్య కల్యాణ మందిరంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గ్రంధి రామకృష్ణ, మాటూరి శివరామకృష్ణ, కోల్లిపర సీతారాంబాబు,ప్రసాద్, వంశీ, ఆంజనేయులు, గ్రంధి సత్యనారయణ, గ్రంధి సుబ్రహ్మణ్యం వచ్చిన భక్తులను పర్యవేక్షించారు.

బైక్‌లు, కార్లు తగులబెట్టిన కేసులో
నిందితుల అరెస్టు
విజయవాడ (క్రైం), ఆగస్టు 23: నగరంలో పార్కింగ్ చేసి ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు తగులపెట్టిన కేసులో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు డీసీపీ విజయారావు తెలిపారు. తన ఛాంబర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 21న అర్థరాత్రి అరగంట వ్యవధిలో మూడు ప్రాంతాల్లో అజిత్‌సింగ్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో కృష్ణా హోటల్ సెంటర్ సమీపంలో ముగ్గురు గుర్తు తెలీని వ్యక్తులు రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న మారుతీ వేగనార్ కారు, అదేవిధంగా పల్సర్ మోటారు సైకిల్, యాక్సెస్ బైక్‌లను తగులబెట్టారు. అదేవిధంగా సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నాలుగులైనులో ముగ్గురు గుర్తు తెలీని వ్యక్తులు రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న హోండా సిటీకారు, హోండా ఏవియేటర్ బైక్‌లను తగులబెట్టారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట సీసీ కెమేరా పుటేజీల ద్వారా నిందితులను గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ విజయారావు తెలిపారు. అరెస్టయిన వారిలో కొత్త రాజరాజేశ్వరీపేటకు చెందిన గుమ్మడి సంజయ్‌బాబు (19), ఇద్దరు మైనర్ బాలురు ఉన్నారు. మద్యానికి బానిసలై మత్తులో నేరానికి పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవడం వల్లే నేరప్రవృత్తి వైపు మళ్లినట్లు చెప్పారు, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడినా, ఆకతాయి పనులు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
* రౌడీషీటర్ ఏబిఎల్ అరెస్టు
సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురానగర్‌కు చెందిన రౌడీషీటర్ సింగరాతి యేబేలు (21)పై నగరంలోని పలు పోలీస్టేషన్లలో 16 కేసులు నమోదై ఉన్నాయి. ఆయా కేసుల్లో పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లి తిరిగి బయటకు వచ్చాడు. కాగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేపధ్యంలో రౌడీషీటర్‌ను తిరిగి సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు.

పేదలంటే ఎందుకంత అసహ్యం
విజయసాయిరెడ్డి ట్వీట్లపై వర్ల ధ్వజం
విజయవాడ(సిటీ), ఆగస్టు 23: పేద ల ఓట్లతో అందలం ఎక్కిన వైసీపీ నేత లు ఇప్పుడు వారిని కించపరిచే విధం గా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. పేదలపై విజయసాయిరెడ్డికి ఉన్న అసహ్యం సోమరిపోతులనడంలోనే కనబడుతుందన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు ఎప్పు డు స్నేహితుడయ్యాడో అప్పటి నుండి విజయసాయిరెడ్డి కోట్లకు పడగలెత్తారన్నారు. జగన్ స్నేహానికి ముందు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి సామాన్య ఆ డిటర్ మాత్రమేనన్నారు. సీఎం జగన్ ప్రతి అక్రమాల్లో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర అన్నారు. జగన్ ఏ1 ముదా యి అయితే విజయసాయిరెడ్డి ఏ2 ముద్దాయిగా 11 కేసుల్లో సీబీఐ చార్జిషీటుల్లో ఉందన్నారు. అటువంటి వ్యక్తి పేద ప్రజలపై తన అసహ్యాన్ని వెళ్లగక్కుతూ ట్వీట్లు చేస్తున్నారన్నారు. అన్నా క్యాంటీన్ మూసివేసిన తరువాత ప్రభుత్వానికి చాలా ఆదాయం కలిసొచ్చిందని, వాటివల్ల ప్రజలు ఇంటిలో వండుకోవడం మానేసి సోమరిపోతులుగా త యారయ్యారని దీనిని తమ ప్రభుత్వం అసలు సహించదని, అయినా ఏడుపులు భరించలేక మరల సెప్టెంబర్ 2 నుండి అన్న క్యాంటీన్లు తెరుస్తున్నామని, ఇంకా సోమరిపోతులుగా తయారవ్వండని విజయసాయిరెడ్డి ట్వీట్ చే యడం వైసీపీ ప్రభుత్వానికి పేద ప్రజలపై ఉన్న చిన్న చూపును బహిర్గతం చేస్తోందన్నారు.్ఫజు రీయింబర్స్‌మెం ట్ ఇప్పించమని రోడ్లపైకి వచ్చిన పేద విద్యార్థులను దారుణంగా కొట్టించారన్నారు. సమస్యల పరిష్కారానికి ఆం దోళనకు దిగిన ఆశా వర్కర్లపై నాన్ బె యిలబుల్ కేసులు పెట్టించారని, పేదవారు సమస్యలతో సీఎం ఇంటి వద్దకు వస్తే 144 సెక్షన్ పెట్టించారన్నారు. మీ ప్రభుత్వం పేదవారిని ఎంత అసహ్యించుకుంటుందో ఈ విపరీత చర్యలన్నీ అద్ధంపడుతున్నాయని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పేదవర్గాలపై ఇంత అసహ్యాన్ని పెంచుకోవడం తగదన్నారు. వెంటనే తన ట్వీట్లను ఉపసంహరించుకుని, పేదవారికి క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
అహంకారానికి నిదర్శనం
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరం వి దూషకుడు విజయసాయిరెడ్డి అని జి ల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్త నాగేంద్రకుమార్ విమర్శించారు. కేసు ల నుండి తప్పించుకునేందుకు పీఎం వో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. 2014 ఎ న్నికలకు ముందు దొనకొండ ప్రాం తంలో రాజధాని వస్తుందని విపరీతం గా కొన్న భూములకు విలువ కోల్పోవడంతో మరల ఆ భూముల విలువ పెం చడానికి ఆ రియాల్టర్లను ఆర్థిక బలవంతులను చేయడానికి అంతరంగిక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన కుట్ర అని తెలిపారు. దీనికి ఉదాహరణగా ఆ ప్రకటన వచ్చి న 12 గంటల లోపే దొనకొండ ప్రాం తంలో సుమారుగా 50 నుండి 60 వెం చర్లు తెరమీదకు రావటం ఈ కుట్రను తేటతెల్లం చేస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజా రాజధానిని తరలించడం ఎవరితరం కాదన్నారు.

వినాయక చవితి ఉత్సవాలకు
ముందస్తు అనుమతి తప్పనిసరి
విధి విధానాలు ప్రకటించిన పోలీసుశాఖ
విజయవాడ (క్రైం), ఆగస్టు 23: రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీసుశాఖ పలు నియమ నిబంధనలు ప్రకటించింది. వినాయక చవితి పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు కాకుండా నెల రోజుల ముందు నుంచే ఇందుకు సంబంధించిన అనుమతి ప్రక్రియలకు నిర్వహకులు దరఖాస్తు చేసుకోవాలని కమిషనరేట్ వర్గాలు స్పష్టం చేశాయి. అనుమతి కోసం లబ్బీపేట మహిళా పోలీస్టేషన్ ప్రాంగణంలో ఉన్న సమీకృత పోలీసు సేవా కేంద్రం (యుపిఎస్‌సి)లో దరఖాస్తులు సమర్పించాలి. సమర్పించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన మీదట అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమీకృత పోలీసు సేవా కేంద్రం పని చేయనుంది. గత ఏడాది మాదిరిగా ముందుగా పంచాయతీ, మున్సిపల్, ఫైర్, ఎలక్ట్రిసిటీ శాఖల నుంచి పొందిన అనుమతి పత్రాలతో అర్జీ అందించాల్సి ఉంటుంది. * నిర్వాహకులు పాటించాల్సి న నియమాలు
* వినాయక విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళను ఏర్పాటు చేసుకునేందుకు అదేవిధంగా ఊరేగింపునకు తప్పనిసరిగా పోలీసు అనుమతి తీసుకోవాల్సి ఉంది.
చవితి పందిళ్ళ ఏర్పాటుకు వివిధ శాఖల నుంచి అనుమతి తీసుకోవడానికి బదులు సులభతరం చేస్తూ కార్పొరేషన్, ఫైర్, పంచాయతీ శాఖల సమన్వయంతో పోలీసుశాఖే అనుమతి ఇవ్వడం జరుగుతుంది.
పోలీసులకు దరఖాస్తు చేసే సమయంలో యూపీఎస్‌సీ కార్యాలయంలో ఉన్న దరఖాస్తు ఫారంలోని అన్ని కాలములను పూరించాల్సి ఉంది.
ప్రతి పోలీస్టేషన్ పరిధికి ఒక పోలీసు అధికారిని నియమిస్తూ మిగిలిన శాఖలు, మండపాల ఆర్గనైజింగ్ కమిటీతో సమన్వయకర్తగా వ్యవహరించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్గనైజింగ్ కమిటికి ఏ విధమైన సమస్య లేక సందేహాలు వచ్చినా ఈ సమన్వయ అధికారిని లేదా సదరు పరిధి పోలీస్టేషన్‌ను గాని, డయల్ 100ను గాని సంప్రదించాల్సి ఉంటుంది.
మండపాల వద్ద శబ్ద కాలుష్య క్రమబద్ధీకరణ, నియంత్రణ నిబంధనలు 2000 ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాలో పగలు 55, రాత్రి 45 డిసిబుల్స్‌కు మించకుండా ఉండే విధంగా బాక్సు టైపుస్పీకర్లు ఏర్పాటు చేసకోవాలి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లౌడు స్పీకర్లు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు.
బాక్సు స్పీకర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి. మైక్/స్పీకర్ యొక్క ధృవతరంగాలు శబ్ధ కాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నిబంధనలు 2000 ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి.
విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియచేయాలి. బాక్సు టైపు స్పీకర్లు వాడుతున్నది లేనిది ఉపయోగిస్తే ఆయా తేదీలను తప్పనిసరిగా తెలియచేయాల్సి ఉంది.
భద్రత కోసం రాత్రి వేళల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలి. మండపాల వద్ద ఏవిధమైన అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు నీరు, ఇసుక ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పందిరి వద్ద నిర్వహకులు సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలి. 24/7 సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. ఏవరికి వారు తగు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
మండపం పటిష్టతను దృష్టిలో ఉంచుకుని పూజ నిర్వహించే సమయంలో మండపంపై ఎక్కువ మంది జనం లేకుండా చూడాలి. విగ్రహ పందిళ్ళ చుట్టుప్రక్కల వాహనాలను పార్కింగ్ చేయకూడదు. పందిళ్ళకు దూరంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంగాని రోడ్డుపైన ఉండకూడదు. బ్యానర్లుగాని, ఫ్లెక్సీలుగాని, రోడ్డుపైన పెట్టరాదు. వినాయక పందిళ్ళ వల్ల ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించరాదు. ఊరేగింపు సమయంలో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించడం చేయరాదు. అలాగే ఊరేగింపుతో పాటు వెళ్ళే మత నాయకులు వేరే మతాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా మత సామరస్యం పాటించాలి.
పందిళ్ళు ఏర్పాటుకు, ఊరేగింపు సమయంలో వినియోగించే స్పీకర్లు, యాంప్లిఫైర్ సిస్టం ముందుగా తనిఖీ చేసిన అనంతరం వినియోగించాలి.
ఆయా పరిసర ప్రాంతాల్లో అనుమానిత కొత్త వ్యక్తుల సమాచారం గూర్చిగాని వదిలి వేసిన వస్తువుల గూర్చి గాని ఉత్సవ నిర్వహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
వినాయక చవితి పందిళ్ళలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరుగకుండా వైరింగ్‌ను జాగ్రత్తగా చేయించుకోవాలి.
విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో గులామ్‌లు/రంగులు చల్లడం, లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం, మందుగుండ సామాగ్రిని పేల్చడం చేయరాదు.
ఊరేగింపు సమయంలో పోలీసు అనుమతి లేకుండా వేషధారణలు ఎక్కువ శబ్దం వచ్చే వాయిదాలు, తీన్‌మార్‌లు అనుమతించేదీ లేదు.
ప్రజల సౌకర్యార్ధం సీతమ్మవారి పాదాల వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.
విగ్రహ ఊరేగింపు సమయంలో భారీ వాహనాలు పెట్టరాదు. లారీల పైగాని ట్రైలర్స్‌పైగాని అర్కెస్ట్రా వినియోగించరాదు.
ఊరేగింపు సమయంలో కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి పాల్గొనరాదు. ప్రదర్శనలో చూపిన సమయం రూటు ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అర్జీదారుడు, కార్యనిర్వహకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు భద్రత కోసం తగినంత మంది వాలంటీర్లను ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి.