కృష్ణ

అమరావతిని మార్చే కుట్రలు మానుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజారాజధాని అమరావతిని మార్చే కుట్రలు మానుకోవాలని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. అమరావతిని కాదని మరో ప్రాంతానికి రాజధానిని తరలిస్తే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చరిత్ర హీనులుగా మిగిలిపోతాడన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన రాజధాని అమరావతి, పోలవరం, పీపీఎల విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఆయన తూర్పారబట్టారు. ఎటువంటి పెట్టుబడులు లేకుండా రాజధాని నిర్మాణానికి తమ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రకరకాల కారణాలు చూపుతూ రాజధానిని మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అదే జరిగితే రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల ఆ ప్రాంత భూముల ధరలు ఆమాంతం తగ్గిపోయాయన్నారు. అంతే కాకుండా 13 జిల్లాలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రజా సంక్షేమం కోసం పని చేయకుండా కమీషన్ల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రివర్స్ టెండర్లన్నీ కమీషన్ల కోసమేనన్నారు. పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం గర్హనీయమన్నారు. రివర్స్ టెండరింగ్ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చంప పెట్టన్నారు. అవినీతిని చూపకుండా రీ టెండర్లకు వెళ్లడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమేనని రివర్స్ టెండరింగ్‌ను తెర మీదకు తీసుకు వచ్చారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 6.5శాతం పనులను 71శాతానికి తీసుకువెళ్లి పోలవరంను గాడిన పెట్టామన్నారు. అన్న క్యాంటీన్ల విషయంలో ఎ2 ముద్దాయి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలను ఎమ్మెల్సీ అర్జునుడు తీవ్రంగా తప్పుబట్టారు. అన్న క్యాంటీన్ల వల్ల ప్రజలెవ్వరు ఇళ్లల్లో అన్నం వండుకోవడం లేదని, తక్కువ ధరకు లభిస్తున్న భోజనం చేసి సోమరిపోతులుగా మారుతున్నారని, అన్న క్యాంటీన్లు మూసిన తర్వాత ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం తగ్గిందని, టీడీపీ నేతల ఏడుపు చూసి మళ్లీ అన్న క్యాంటీన్‌లను తెరుస్తున్నామని, అందులో అన్నం తిని మరింత సోమరిపోతులు కండి అంటూ ప్రజలనుద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను అర్జునుడు తీవ్రంగా తప్పుబట్టారు. మానవత్వం ఉన్న వ్యక్తి ఎవ్వరూ ఆ విధంగా ట్విట్లు చేయరన్నారు. ఒకప్పుడు రెండు గదుల్లో ఉన్న విజయసాయిరెడ్డి నేడు కోట్లకు పడగలు ఎత్తాడని, సామాన్యుల వల్లే రాజ్యాలు నిలబడతాయన్న విషయాన్ని విజయసాయిరెడ్డి మరచిపోయినట్టు ఉన్నాడన్నారు. అలాగే సోషల్ మీడియాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్‌పై ఓ రైతు చేసిన వ్యాఖ్యలను కూడా అర్జునుడు తప్పుబట్టారు. కానీ ఆ రైతు కడుపు మంటతో ఆ వ్యాఖ్యలు చేస్తే మంత్రి అనీల్ కుమార్ యాదవ జాతిని మరింత అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్, పాల్గొన్నారు.