కృష్ణ

మాజీ సైనికులకు సైతం నివేశన స్థలాలు ఇస్తాం: మంత్రి పేర్ని నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : మాజీ సైనికులకు సైతం నివేశన స్థలాలు అందజేస్తామని రాష్ట్ర స మాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వె ంకట్రామయ్య (నాని) అన్నారు. ఆదివారం స్థానిక సువర్ణ కల్యాణ మండపంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మాజీ సైనికులంటే తనకు అపారమైన గౌరవమన్నారు. దేశ రక్షణ కోసం పోరాడిన మాజీ సైనికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. రానున్న ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వనున్న 25లక్షల నివేశన స్థలాల్లో మాజీ సైనికులకు కూడా స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు టిక్కెట్లలో రాయితీ, కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌తో పాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాజీ సైనికులకు కొంత నగదు లబ్ధి సౌకర్యం కల్పిస్తున్నాయని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మంత్రి పేర్ని నానిని పలువురు మాజీ సైనికులు కోరారు. ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రి పేర్ని హామీ ఇచ్చారు. స్థానికంగా 200 మంది మాజీ సైనికులకు గత వైఎస్‌ఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు నేటికీ పొజిషన్ చూపలేని పరిస్థితిలో ఉన్నారని, ఈ సమస్య పరిష్కరించి వచ్చే ఉగాది నాటికి మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ ఎంవిఎస్ కుమార్, జిల్లా సైనిక్ వెల్ ఫేర్ ఆఫీసర్ వివి రాజారావు, జిల్లా అధ్యక్షుడు బదరీ ప్రసాద్, మాజీ పోలీసు అధికారి ప్రేమ్‌కుమార్, రిటైర్డ్ కల్నల్ ఎన్‌ఆర్‌కె రావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు షేక్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు బార్లపూడి ఛానల్‌కు మోక్షం
* రైతుల భాగస్వామ్యంతో పూడిక తీత పనులు ప్రారంభం
కూచిపూడి, ఆగస్టు 25: రైతుల ఆందోళన ఫలితంగా ఎట్టకేలకు ఇరిగేషన్ శాఖ రైతుల భాగస్వామ్యంతో బార్లపూడి ఛానల్ పూడిక తీత కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టింది. మొవ్వ మండలం పరిధిలోని బార్లపూడి, కూచిపూడి, మొవ్వ, నర్సంపాలెం, మొవ్వపాలెం, వేములమడ ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు అందిస్తూ వేములమడ శివారు భీమనది డ్రైన్‌లో కలిసే ఈ కాలువ 150 నీటి సంఘాల పరిధిలో ఉంది. బార్లపూడి ఛానల్ ఎగువ ప్రాంతాల్లో రైతులు కాలువలకు అడ్డుకట్టలు, పైప్‌లు, తాటిబొండులతో నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటంతో మేడూరు ఛానల్ పరిధిలోని కాలువకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. గత ఐదు సంవత్సరాల నుండి ఈ సమస్యపై రైతులు పోరాడినా ఫలితం నామమాత్రమే. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తోడవటంతో అరకొరగా విడుదలవుతున్న సాగునీరు అందక మొవ్వ మండల పరిధిలోని రైతులకు 50 శాతం పైగా వ్యవసాయ భూముల్లో నేటికీ వరి నాట్లు ప్రారంభం కాలేదు. వరి నాట్లు వేసిన వ్యవసాయ భూములు నీరు లేక ఎండిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటూ పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్ కుమార్ దృష్టికి గతంలో తీసుకువెళ్లారు. ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు చేసి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో మొవ్వ పీఎసీఎస్ మాజీ అధ్యక్షుడు తాతినేని శరత్ కుమార్, 150 నీటి సంఘాల మాజీ అధ్యక్షులు రైతుల నుండి రూ.20వేలు వసూలు చేసి ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు చేసి వారి నుండి రూ.20వేలు విడుదల చేయించారు. ఈ నిధులతో ఆదివారం ప్రొక్లైన్ ద్వారా దాదాపు 5కిలో మీటర్ల నిడివి గల భీమనది ఛానల్ పూడిక తీత పనులను ప్రారంభించటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.