కృష్ణ

అంగన్‌వాడీల సేవలు నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ పథకాల అమలులో జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కారకులైన అంగన్‌వాడీ కార్యకర్తల సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. అటువంటి అంగన్‌వాడీ కార్యకర్తలను థాంక్యూ అంగన్‌వాడీ అక్కా అని గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు. పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన థాంక్యూ అంగన్‌వాడీ అక్క కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత నెల 31వతేదీన పదవీ విరమణ చేసిన అంగన్‌వాడీ కార్యకర్త మత్తి లక్ష్మీకుమారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. పోషన్ అభియాన్ కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావటంతో పాటు జాతీయ స్థాయిలో ఐదు స్కోచ్ అవార్డులు జిల్లాకు అందించడంలో స్ర్తి శిశు సంక్షేమ శాఖ కీలక పాత్ర పోషించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ స్ర్తి శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు గ్రామాల్లో విద్య, స్ర్తి శిశు సంక్షేమంతో పాటు సామాజిక అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్న అంగన్‌వాడీ కార్యరక్తల సేవలను గుర్తు చేసుకుని వారిని థాంక్యూ అంగన్‌వాడీ అక్కా కార్యక్రమం ద్వారా సన్మానించడం రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. చిరు ఉద్యోగి అయినా గ్రామాభివృద్ధికి, ప్రభుత్వ పథకాల అమలుకు విశిష్ట సేవలు అందించి ప్రజలందరితో సన్మానం పొందడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అనుపమ అంజలి, ఐసీడీఎస్ ఇన్‌ఛార్జ్ పీడీ భార్గవి, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, తహశీల్దార్ పి మధుసూదనరావు, ఎపీడీఓ జె రామనాధం తదితరులు పాల్గొన్నారు.