కృష్ణ

ఆంధ్రాబ్యాంక్ విలీనాన్ని నిరసిస్తూ నేడు రౌండ్ టేబుల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : జాతీయ బ్యాంక్‌ల విలీన ప్రక్రియను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలలో భాగంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డా. భోజరాజు పట్ట్భా సీతారామరాజు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆంధ్రాబ్యాంక్ విలీనాన్ని నిరసిస్తూ బుధవారం ఎఐటీయుసీ, సీఐటీయు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. బస్టాండ్ సెంటరులోని బెల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హాలు నందు సాయంత్రం 5గంటలకు జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిథులు హాజరై విజయవంతం చేయాలని మంగళవారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎఐటీయుసీ, సీఐటీయు నాయకులు కోరారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జి కిషోర్ కుమార్, లింగం ఫిలిప్, బూర సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు తదితరులు పాల్గొన్నారు.

దాలిపర్రు వద్ద తాత్కాలిక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం
చల్లపల్లి, సెప్టెంబర్ 10: భీమనది ఛానల్ చివరి భూములకు సాగునీరు అందించేందుకు ఘంటసాల మండలం దాలిపర్రు వద్ద ఆయిల్ ఇంజన్‌లతో తాత్కాలిక లిఫ్ట్ ఇరిగేషన్‌ను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌బాబు, రైతు సాధికార సంస్థ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. దాలిపర్రు, లంకపల్లి, మాజేరు, ఎండకుదురు, పూషడం గ్రామాలకు చెందిన దాదాపు 5వేల ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందనుంది. చివరి భూములకు జనసేన పార్టీ మాస్టర్ ట్రైనర్ రాయపూడి వేణుగోపాలరావు సదరు గ్రామాలలో వ్యవసాయ భూములను పరిశీలించి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయిల్ ఇంజన్‌లతో భీమనది ఛానల్‌పై లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయటం పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలకు శాశ్విత పరిష్కారంగా లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, చల్లపల్లి, ఘంటసాల మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.