కృష్ణ

రైతు సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమర్ మాట్లాడుతూ తోట్లవల్లూరు మండల సమస్యలపై సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించటం జరిగిందని తెలిపారు. వెంటనే ఆయన స్పందించి ఈ సమస్యలను పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. కృష్ణానదికి వరద వచ్చి లంకల్లో పంటలు వేసిన రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపానని, దానికి ఆయన గత ప్రభుత్వ హాయంలో నిర్ణయించిన పరిహారం కంటే 15శాతం పెంచి రైతులకు నష్టపరిహారం అందించాలని అధికారులకు సూచించారని తెలిపారు. వరదల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అలాగే వరదల ధాటికి ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు ఉగాదికి ఇచ్చే ఇళ్లస్థలాల పంపిణీ సమయంలో ఇండ్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారని తెలిపారు. వరదల ధాటికి పాడైపోయిన అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పాములలంక వంతెన నిర్మాణానికి వారంలో టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ఇసుక విధానంపై రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. నదులకు వరద రావటం వల్ల కొంత ఆలస్యమవుతున్నదని, తొందరలోనే అనేక చోట్ల ఇసుక రేవులు తెరవటం జరుగుతుందని అప్పుడు ఇసుక సమస్యకు పరిష్కారం అవుతుందని తెలిపారు. వలంటీర్లు, సచివాలయాలు ఏర్పాటైన తర్వాత ప్రజలందరికి పారదర్శక పారిపాలన అందుతుందని, అప్పుడు ప్రజలే ఈ పాలనను మెచ్చుకుంటారని తెలిపారు. అలాగే కరకట్ట మీద ప్రజల కొరిక మేరకు శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు మంత్రితో మాట్లాడి బస్సు రూట్ ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ బస్సు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటలకు అనేక ట్రిప్పులు వేస్తుందని, దీనిని కరకట్ట గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనిల్‌కుమార్ కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, మండల వైసిపి కన్వీనర్ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, వైసిపి నాయకులు కిలారం శ్రీనివాసరావు, కిలారం రామకృష్ణ, గొరిపర్తి శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, పిఎస్ కోటేశ్వరరావుపాల్గొన్నారు.

అండర్ పాస్ నిర్మించారు..
డ్రైనేజీని మరిచారు..
పమిడిముక్కల, సెప్టెంబర్ 10: మండల పరిధిలోని విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిలో గోపువానిపాలెం వద్ద నిర్మించిన అండర్‌పాస్ కింద వర్షం వస్తే జలమయమై వా హన చోదకులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ జాతీయ రహదారిపై పలు చోట్ల నిర్మించిన అం డర్‌పాస్‌లకు సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవటం వల్ల కొద్ది పాటి వర్షానికే నీరు నిలిచి తాటాకాలను తలపిస్తున్నాయి. ఒక రోజు వర్షం వస్తే దాదాపు పది రోజులు పాటు నీరు నిల్వ ఉండి వాహనాల రాకపోకలు వల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో వాహనలు వన్‌వే మార్గంలో వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే జాతీయ రహదారి అధికారులు స్పందించి అండర్‌పాస్‌ల కింద డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

గణనాథునికి ఎమ్మెల్యే సింహాద్రి ప్రత్యేక పూజలు
అవనిగడ్డ, సెప్టెంబర్ 10: స్థానిక 6వ వార్డులో గణేష్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎన్‌విఎస్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం జరుగ్గా నాగిరెడ్డి వడ్డన చేసి ప్రారంభించారు. అలాగే 9వ వార్డులో ఏర్పాటు చేసిన గణనాధుని విగ్రహం వద్ద హెచ్చు పాటదారునికి లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యే రమేష్‌బాబు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా కార్యదర్శి కె నరసింహారావు, చింతలపూడి బాలు, పృధ్వీ నారాయణ, పృధ్వీరాజు తదితరులు పాల్గొన్నారు.