కృష్ణ

బైబై గణేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : చలువ పందిళ్లల్లో నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనోత్సవాలు బుధవారం కోలాహలం గా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనోత్సవాలు అత్యం త భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాగర తీరం తో పాటు కృష్ణానది తీరాల్లో విఘ్న వినాయకుడి నిమజ్జనోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మంగినపూడి శివారు సత్రంపాలెం బీచ్ వద్ద నిమజ్జనోత్సవాల సందడి నెలకొంది. మచిలీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన గణనాథులను పెద్ద ఎత్తున వారి వారి గ్రామాల మీదుగా ఊరేగింపుగా సత్రంపాలెం బీచ్‌కు తీసుకు వచ్చి సముద్రంలో నిమజ్జనం చేశారు. ఉదయం నుండి సాయంత్రం పొద్దుపోయే వరకు నిమజ్జనోత్సవాలు కొనసాగాయి. తీన్‌మార్ డాన్స్‌లు, డప్పు వాయిద్యాల నడుమ సాగిన నిమజ్జనోత్సవ ఊరేగింపుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. జైజై గణేశా.. నినాదాలతో సాగర తీరం ఘోషించింది. బీచ్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బీచ్‌లో స్నానం చేసే సాధారణ పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి బీచ్‌లో ప్రత్యేకమైన ప్రాంతాన్ని గుర్తించి అక్కడ నిమజ్జనాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. డియస్పీ మొహబూబ్ బాషా పర్యవేక్షణలో బందరు తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొండయ్య, ఎస్‌ఐ మూర్తి తమ సిబ్బందితో బందోబస్తు విధులు నిర్వహించారు.