కృష్ణ

మళ్లీ వరదొచ్చే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : కృష్ణానదికి మళ్లీ వరద పోటెత్తుతోంది. ఎగువ నుండి భారీగా వస్తున్న వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 4లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. 70 గేట్లను ఆరు అడుగుల ఎత్తు మేర లేపి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతా లు, లంక గ్రామాల్లో వరద అలజడి సృష్టిస్తోంది. గత నెలలో సంభవించిన వరదకు తీవ్రంగా నష్టపోయిన లంక గ్రామాల ప్రజలు మరోసారి వరద బా రిన పడ్డారు. ఆగస్టు రెండవ పక్షంలో ఎగువ రాష్ట్రాల నుండి వచ్చిన వరద లంక గ్రామాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. సుమారు 8.50లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరగ్గా వందలాది గృహాలు నీట మునిగాయి. పదుల సంఖ్యలో లంక గ్రా మాలు జలదిగ్బంధానికి గురయ్యా యి. ఇప్పుడిప్పుడే వరద సృష్టించిన భీభత్సం నుండి తేరుకుంటున్న నేపథ్యంలో కృష్ణానదికి మరోసారి వచ్చిన వరద మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విడత 4 నుండి 5లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు అధికారులను అప్రమత్తం చేశాయి. గత నెలలో తీసుకున్న చర్యలనే మళ్లీ అధికార యంత్రాంగం తీసుకుంటుంది. గతంలో జరిగిన లోటు పాట్లను ఈ విడత జరగనివ్వకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ వరద ప్రభావిత 17 మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. వరద నీటి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని లంక గ్రామాల్లో ముందస్తు సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముంపుకు గురయ్యే గ్రామాలను గుర్తించి అవసరమైతే ఆ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత కూడా వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్ రూపేణా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
బిరబిరా కృష్ణమ్మ..
* పడవలపై వెళుతున్న లంక ప్రజలు
తోట్లవల్లూరు, సెప్టెంబర్ 11: తోట్లవల్లూరు మండలంలో కృష్ణానదీపాయలో బుధవారం బిరబిరా కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. పెద్దఏటిపాయ, కరకట్టవెంట ఉన్న పాయలు, లంకల్లో ఉన్న చిలకలదిబ్బ పాయలకు వరద నీరు వచ్చి చేరింది. కృష్ణానదీకి వరద రావటంతో పాములలంక, తోడేళ్ళదిబ్బలంక, పిల్లివానిలంక, కనిగిరిలంక, కాళింగదిబ్బలంక, తుమ్మలపచ్చికలంక, పొట్టిదిబ్బలంక, ములకలపల్లిలంకలకు ప్రజలు వెళ్ళాలంటే పడవలపై ప్రయాణించాల్సిందే. ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు సుమారు 3.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని తహశీల్దార్ ఆర్ దుర్గాప్రసాద్ తెలిపారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు అవసరం ఉంటే తప్ప పడవలపై లంకలకు వెళ్ళరాదని సూచించారు. మండలంలోని అన్ని ప్రాంతాల్లో అధికారులు అలర్ట్‌గా ఉన్నారని తెలిపారు.