కృష్ణ

బ్రాహ్మణులంతా రాజకీయాలకు అతీతంగా పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : బ్రాహ్మణులంతా రాజకీయాలకు అతీతంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘాల నజాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గుండెపూడి రామశంకర్ అన్నారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘాల బస్సు యాత్ర ఆదివారం జిల్లా కేంద్రం మచిలీపట్నం చేరుకుంది. మహతి లలిత కళావేదికపై నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రామశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామశంకర్ మాట్లాడుతూ జెఎసీ ఆధ్వర్యంలో నవంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో జాతీయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బ్రాహ్మణులంతా రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ జాతీయ సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసీ ప్రతినిధులు ఎఆర్‌కె మూర్తి, కానుకొలను ఫణి కిరణ్, పివి ఫణికుమార్, ఎన్ సత్యప్రకాష్, చోడవరపు ప్రసూన్న, అంబటిపూడి నాగలక్ష్మి, కె అనుపమ, వేమూరి రాకమృష్ణారావు, మద్దూరి ప్రసాద్, మోపర్తి సుబ్రహ్మణ్యం, కాండూరి పాండు, పి మురళి, లొల్లా కుటుంబ శాస్ర్తీ, లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా రోటరీ యూత్ ఫెస్టివల్
కూచిపూడి, సెప్టెంబర్ 15: రోటరీ 2019 యూత్ ఫెస్టివల్‌లో భాగంగా ఆదివారం మొవ్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ప్రధాన రహదారిలో బాల బాలికలు నిర్వహించిన స్లో సైక్లింగ్, బాల, బాలికల కబడ్డీ, 400 మీటర్ల పరుగు పోటీలు క్రీడాభిమానులను కనువిందు చేశాయి. స్లో సైక్లింగ్ బాలుర విభాగంలో ఎం ప్రశాంత్ కుమార్, పి ఉదయకాంత్, టి సుమంత్, బాలికల విభాగంలో ఎల్ ధన దీపిక, ఎ ప్రమీల, రుత్వీక, 400 మీటర్ల పరుగు పందెంలో 400 మీటర్ల రన్నింగ్ బాలుర విభాగంలో జి గణేష్, జె వంశీ, జె రఘు, బాలికల విభాగంలో రామలక్ష్మి, రమాదేవి, సోనాలిక తొలి మూడు స్థానాలు సాధించారు.