కృష్ణ

పారదర్శకంగా జగన్ పరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి నేతృత్వంలో పరిపాలన పారదర్శకంగా సాగుతోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కితాబునిచ్చారు. మైలవరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వెలంపల్లికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం స్థానిక చలవాది కల్యాణ మండపంలో జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ జగన్ వంద రోజుల పాలనలోనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో 80శాతం అమలు చేశారన్నారు. కానీ వంద రోజుల పాలనపై అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కల్యాణ్ విమర్శించటం శోచనీయమన్నారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట కూడా గెలవలేని పవన్ కల్యాణ్ కూడా జగన్ పాలనపై విమర్శలు గుప్పించటం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈరాష్ట్రాన్ని దోపిడీ చేసి ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్, జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముగ్గురు కలసి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రెట్టింపు ఎస్టిమేట్లు వేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి వాటిపై విచారణ జరిపిస్తుంటే వారిలో వణుకు మొదలైందన్నారు. గడచిన 100 రోజుల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చి రికార్డు సృష్టించిన జగన్‌పై విమర్శలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకూ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఉగాది నాటికి అర్హత కలిగిన వారందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాజధానిపై ప్రజల్లో అపోహలొద్దని కొందరు కావాలనే కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి దశ-దిశ వైఎస్ జగన్ అన్నారు. అవినీతి, అక్రమాలకు దూరంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా తాను పని చేస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు మాట్లాడుతూ జగన్ మోహనరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జరిగే అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు. ఎక్కువగా ఊహించుకుని విమర్శలు చేయటం సహేతుకం కాదన్నారు. ఇంకా ఈసమావేశంలో లయన్స్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ ఎస్వీఎన్ నివృత్‌రావు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ సుంకర అక్కయ్య నాయుడు, మాజీ మండలాధ్యక్షులు జొన్నలగడ్డ గంగాధరరావు, మాజీ జడ్పీటిసి బ్రహ్మయ్య, వ్యాపారవేత్త చలవాది మల్లిఖార్జునరావు, కార్యక్రమ నిర్వాహకులు గుప్తా మరియు మిత్రబృందం, ఆర్యవైశ్య సంఘ నేతలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌కు, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ తదితరులను ఘనంగా సత్కరించారు.