కృష్ణ

రాజధాని అమరావతిపై ప్రభుత్వం స్పష్టతివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి: రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 28వ మహాసభలకు హాజరైన ఆయన ఆదివారం స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. అమరావతిని రాజధానిగా ఉ ంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించా రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం హైదరాబాద్‌ను అభివృద్ధి చే సి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ పనులు, ఉపాధి హామీ పనులు నిలిచిపోవటంతో రాష్ట్రంలో ఎక్కడ పనులు అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తీవ్ర సమస్యగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఒకే భాష ఉండాలి, 2022 నాటికి హిందీని జాతీయ భాషగా అంగీకరించి అమలు జరగాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విధానమన్నారు. అన్ని భాషలు సమానమేనని అమిత్‌షా గుర్తెరగాలన్నారు. నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు యద్దనపూడి మధు పాల్గొన్నారు.