కృష్ణ

ఓటర్ల సౌలభ్యం కోసమే ఈవీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఓటర్ల సౌలభ్యం కోసం భారత ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టిన ఈవీపీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఓటర్లు తమ వివరాలు సరి చూసుకునే అవకాశాన్ని ఈవీపీ ద్వారా భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా, ఎన్నికల సంఘం వారి ఎన్‌వీఎస్‌పీ పోర్టల్ ద్వారా, సాధారణ సేవా కేంద్రం (కామన్ సర్వీస్ సెంటర్)కు వెళ్లడం ద్వారా, ఓటరు నమోదు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయక కేంద్రానికి వెళ్లి ఓటర్లు తమ వివరాలు సరి చూసుకోవచ్చన్నారు. దివ్యాంగులైన ఓటర్లు 1950 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడం ద్వారా తమ వివరాలు సరి చూసుకోవచ్చని తెలిపారు. ఓటర్లు తమ వివరాలు సక్రమంగా ఉన్నాయా..? లేక ఏమైనా తప్పులు సవరించాలా అనే వివరాలు, వారి ఫోన్ నెంబరు ఈఆర్‌ఓ కార్యాలయంలోని ఓటరు సహాయక కేంద్రంలో సంబంధిత ధృవపత్రాలతో ఒకదాని నకలుతో కలిపి సమర్పించాలన్నారు. తమ వ్యక్తిగత వివరాలలో తప్పులు సరి చూసుకుని వాటిని సవరించుటకు భారతీయ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్ బుక్, రైతులకు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు వీటిలో ఏదో ఒక ధృవపత్రం నకలు సమర్పించాలన్నారు. తమ కుటుంబంలో ఓటరు నమోదైన వ్యక్తి ఎవరైనా మృతి చెందినా, శాశ్వతంగా వలసపోయినా ఫారం-7 ద్వారా తెలియచేయాలన్నారు. అర్హులైన ఓటరుగా నమోదు కాని కుటుంబ సభ్యులు 2001 జనవరి 1వతేదీ నాటికి జన్మించిన వారు, భవిష్యత్తు ఓటరు 2002 జనవరి 2వతేదీ నుండి 2003 జనవరి 1వతేదీ మధ్యలో జన్మించిన వ్యక్తుల వివరాలు తెలియచేయాలన్నారు. తమ పోలింగ్ కేంద్రం సక్రమంగా లేకపోయినా ప్రత్యామ్నాయ భవన వివరాలు సూచించవచ్చని జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత తెలిపారు.

‘అర్జీ’లపై సత్వరం స్పందించాలి
* జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 16: స్పందనలో వచ్చే అర్జీలపై తక్షణం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలపై స్పందించారు. మొత్తం 53 అర్జీలు అందగా కొన్నింటిని పరిష్కరించారు. మరికొన్నింటికి నిర్ణీత గడువు పెట్టారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ దర్మేంద్ర, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ విజయరావు, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, మహిళా పీఎస్ డీఎస్పీ అజీజ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాజారావు తదితరులు పాల్గొన్నారు.