కృష్ణ

కాపుల వౌన ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 14: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం పట్టణంలో కాపు జెఎసి ఆధ్వర్యంలో వౌన ప్రదర్శన నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొని ముద్రగడ అరెస్టును తీవ్రంగా ఖండించారు. కాపుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. జిల్లా పరిషత్ సెంటర్ నుండి ప్రారంభమైన వౌన ప్రదర్శన లక్ష్మీటాకీసు, బస్టాండ్, రేవతి సెంటర్, రాజాగారి సెంటరు మీదుగా కోనేరు సెంటరుకు చేరుకుంది. కోనేరు సెంటరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
పెడన : కాపుల సమస్యపై ముద్రగడ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కాపు యువత తలపెట్టిన ర్యాలీని పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. నేలకొండపల్లి, చోడవరం, పెనుమల్లి, ఎస్‌విపల్లి, తదితర గ్రామాలకు చెందిన కాపు యువత ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నేలకొండపల్లి నుంచి మచిలీపట్నం రేవతి సెంటరులోని రంగా విగ్రహం వరకు ర్యాలీ తలపెట్టారు. అన్ని ఏర్పాట్లు చేసి ర్యాలీకి సిద్ధం కాగా పెడన ఎస్‌ఐ అప్పారి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీ యత్నాన్ని అడ్డుకున్నారు. ఎస్‌ఐ గణేష్ కుమార్ కాపు యువతనుద్దేశించి పలు హెచ్చరికలు చేశారు. పోలీసుల ఆజ్ఞలను ధిక్కరించి ర్యాలీ నిర్వహిస్తే అందుకు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో యువకులు ర్యాలీని విరమించుకున్నారు.