కృష్ణ

బాపులపాడు పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్‌జంక్షన్ : బాపులపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ పునరుద్దరణ, ఆధునీకరణ కోసం అంచనాలు రూపొందించి తనకు నివేదిక అందించాలని సంబంధిత శాఖాధికారులను జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఆదేశించారు. బుధవారం ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. గ్రామంలో 15వేల మంది జనాభా కలిగి ఉన్న నేపథ్యంలో ఆస్పత్రిలో కాన్పులు పోసేందుకు లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ లేకపోవడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు. ఆపరేషన్ థియేటర్ స్థితిగతులపై అరా తీసి ప్రసవాలకు ఎక్కడికి పంపుతున్నారని ప్రశ్నించారు. ఆస్పత్రిలో వీటిని సమకూరిస్తే ప్రసవాలు పోస్తారా..? అని డ్యూటీలో ఉన్న వైద్యులు యంజె మంజూషా, నారాయ్యలను కలెక్టర్ ప్రశ్నించారు. దీనిపై వారు సంబంధిత సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఆస్పత్రిలోనే ప్రసవాలు పోసేందుకు సిద్ధంగా ఉన్నామని బదులిచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆస్పత్రుల వౌలిక వసతుల అభివృద్ధి సంస్థ సంబంధం లేకుండా తక్షణమే ఆస్పత్రిలో ప్రసవాల రూమ్, ఆపరేషన్ థియేటర్ ఆధునీకరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహశీల్దార్ నరసింహరావును ఆదేశించారు. ఇందుకు గాను రూ.15 నుండి రూ.20లక్షలు మంజూరు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ కేశవరెడ్డి, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాల అమలులో
వలంటీర్లు బాధ్యతగా వ్యవహరించాలి
నాగాయలంక, సెప్టెంబర్ 18: ప్రభుత్వ పథకాల అమలులో వలంటీర్లు బాధ్యతగా వ్యవహరించాలని అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వలంటీర్ల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్‌బాబు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వైఎస్‌ఆర్ రైతన్న భరోసా, వైఎస్‌ఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకాలను చేపట్టారన్నారు. గ్రామాలలో ప్రతి 50 కుటుంబాలకు నియమితులైన వలంటీర్లు తమ పరిధిలో గల ప్రజల అవసరాలను గుర్తించాలన్నారు. అందుకు నిర్ధేశించిన నిబంధనలను పాటించాలన్నారు. పేదలకు గృహ నిర్మాణం వర్తించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. లక్షలాది క్యూసెక్కుల వరద నీరు సముద్రం పాలవుతుండగా పంట కాలువలకు పూర్తి స్థాయిలో నీటి మట్టం లేకపోవటాన్ని కొందరు ప్రశ్నించటం అర్ధరహితమన్నారు. పంట కాలువలకు నిర్దేశించిన మేరకే నీటిని విడుదల చేయటం జరుగుతుందన్నారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ పథకాల అమలు విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీడీఓ వేముల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖాధికారి రామసుబ్బారెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఎఇ ఎస్ వెంకటేశ్వరరావు, ఇఓపీఆర్‌డీ దోవారి కీర్తిరాజు, తహశీల్దార్ మద్దినేని వెంకట్రామయ్య, వీఆర్‌ఓ కాగితాల బాబూ రాజేంద్రప్రసాద్, వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు పాల్గొన్నారు.