కృష్ణ

‘స్పందన’తో ప్రజలకు మరింత చేరువ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : స్పందనతో ప్రజలకు మరింత చేరువ కావాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. స్పందనలో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కార చర్యలు, స్పందన అర్జీల పరిష్కార చర్యలపై సర్కిల్ వారీగా సమీక్షించారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, అనుమానాస్పద మృతి కేసులు, ప్రాపర్టీ లాస్ కేసులు తదితర కేసులను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల నమోదు, నేరస్తులను అరెస్టు చేయడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. చార్జిషీటు దాఖలు చేసేంత వరకు ప్రతి ఒక్కరూ సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి వాటిని చార్జిషీటు దశకు తీసుకువెళ్లడానికి తీసుకోవల్సిన సూచనలను చేశారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ అనే వ్యత్యాసం లేకుండా నమోదైన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు నిర్వహించి మెరుగైన ఫలితాలను రాబట్టాలన్నారు. చివరగా బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలన్నారు. స్పందన అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీసు స్టేషన్‌లలో రిసెప్షన్ వ్యవస్థ మెరుగుపడాలని, దాని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలన్నారు. మనం ప్రజా సేవకు లం అని వారికి సేవ చేసే భాగ్యాన్ని హూందాగా అనుభూతి చెందాలన్నారు. అవినీతికి పాల్పడే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, బందరు, గుడివాడ, డీఎస్పీ లు మొహబూబ్ బాషా, సత్యానందం, మహిళా పీఎస్ డీఎస్పీ అజీజ్, ఎఆర్ డీ ఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.