కృష్ణ

వరదలతో సాగని బతుకు నావ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్ : కృష్ణా నదికి వరుసగా వరదలు వస్తుండడంతో నదిలో చేపల వేట చేసి జీవించే మత్స్యకారులు పూర్తిగా ఆదా యం కోల్పోయారు. మండలంలోని ముక్త్యాల , రావిరాల గ్రామాల్లో కృష్ణా నదిపై ఆధారపడి చాలామంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. నదిలో చేపలు పట్టి వాటిని అమ్మి వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. గత నెలలో కృష్ణా నదికి పెద్ద ఎ త్తున వరదలు రావడం, గ్రామాల్లోకి సై తం వరద నీరు ప్రవహించి పదిహేను రోజుల పాటు వరదలు కొనసాగడంతో నదిలో చేపల వేటకు ఆటంకం కలిగినట్లు వారు తెలిపారు. సెప్టెంబర్‌లో వరుసగా వస్తున్న వరదల వల్ల నదిలో వేటకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. శ్రీశైలం, నాగార్జునసాగ ర్, పులిచింతల ప్రాజెక్టులు నుండి దిగువకు లక్షల క్యూసెక్కుల నీరు వి డుదల చేయడంతో గురువారం కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చింది. కృష్ణా నది పరీవాహక గ్రామాలైన ముక్త్యాల, రావిరాల, వేదాద్రిలో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. అకస్మాత్తుగా వరదలు రావడంతో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు వేట నిలిపివేసి పడవలను ఒడ్డుకు చేర్చారు. తరచూ వస్తున్న వరదల వల్ల తాము చేపల వేటకు వెళ్ళలేక ఆదాయం కోల్పోయారు. తమ జీవనం కష్టంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు.

విజేతలకు ప్రశంసా పత్రాలు
కూచిపూడి, సెప్టెంబర్ 19: ఎల్‌ఐసీ 63వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భట్లపెనుమర్రు గ్రామంలోని ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు మచిలీపట్నం బ్రాంచ్-683 నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం బ్రాంచ్ మేనేజర్ చిరంజీవి మెహర్ కుమార్, సహాయ బ్రాంచ్ మేనేజర్ ఎ హరిప్రసాద్, డెవలప్‌మెంట్ ఆఫీసర్ రాజశేఖర్, మాజీ సర్పంచ్ కొడాలి దయాకర్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

విజయవంతంగా సాగర్ కవచ్
కోడూరు, సెప్టెంబర్ 19: కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఆదేశం మేరకు సముద్రంపై నుంచి అపరిచితులుగా వచ్చే కోస్టుగార్డు సిబ్బందిని గుర్తించేందుకు వివిధ రకాల పోలీసు డిపార్ట్‌మెంట్ సిబ్బందితో నిర్వహించిన రెండు రోజుల సాగర్ కవచ్ విజయవంతంగా ముగిసినట్లు పాలకాయతిప్ప మెరైన్ సీఐ వల్లభనేని పవన్ కిషోర్ తెలిపారు. అవనిగడ్డ సబ్ డివిజన్‌లో వివిధ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న 120 మంది సిబ్బందితో ఆ ఆపరేషన్ నిర్వహించారు. నిజాంపట్నం కోస్టుగార్డు నుంచి వచ్చిన సిబ్బందిని వర్లగొందితిప్ప ప్రాంతంలో కనుగొన్నట్లు తెలిపారు.