కృష్ణ

డీఎస్సీ-18 తుది జాబితాను తక్షణమే ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాలు గురువారం విడుదల చేసినప్పటికీ అర్హత మార్కులు మరింతగా తగ్గించి అభ్యర్థులను ఎంపిక చేయాలని శాసనమండలి సభ్యుడు కెఎస్ లక్ష్మణరావు కోరారు. గురువారం సాయంత్రం స్థానిక ఎన్జీవో హోమ్‌లో జరిగే విద్యా సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. 2018 డీఎస్పీ తుది జాబితా ఇప్పటి వరకు ప్రకటించ లేదని, కొన్ని పోస్టుల విషయంలో కోర్టు వివాదాలు ఉన్నాయని విద్యాశాఖ సాకులు చెబుతోందన్నారు. తక్షణమే వివాదాలు పరిష్కరించటం ద్వారా అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, దాదాపు 4వేల సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని గుర్తుచేశారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అందు కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేసే విధంగా ఉప సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఉపాధ్యాయుల బదిలీలు నిలిచిపోయాయని, వచ్చే సంవత్సరం జనాభా లెక్కలు ఉన్నందున ఉపాధ్యాయ బదిలీలకు అవకాశం ఉండదన్నారు. దసరా సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. 11వ వేతన సవరణ సంఘం ఉద్యోగులు, ఉపాధ్యాయుల నివేదిక ఇంత వరకు సమర్పించలేదని, వెంటనే నివేదిక సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం జరిగిన విద్యా సదస్సులో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తదితరులు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం ముసాయిదా కేంద్రం ప్రకటించిందని, విద్యారంగంలో ప్రైవేటీకరణ పెంచేదిగా ఉందన్నారు. ముసాయిదాలో 10*2 విధానం స్థానంలో 5*3*3*4 విధానాన్ని సిఫారస్సు చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రీ ప్రైమరీ విధానం కూడా ప్రవేశ పెట్టాలని ముసాయిదా తెలిపిందన్నారు. కానీ ఈ ప్రీ ప్రైమరీ విధానం ఏ విధంగా ఉండాలో ముసాయిదాలో వెల్లడించలేదన్నారు విధి విధానాలు లేకపోవడంతో ముసాయిదా అయోమయంగా ఉందన్నారు. మన రాష్ట్రంలో రెండు సంవత్సరాలలో వౌలిక వసతులు కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారని, కాగా బడ్జెట్‌లో కేవలం రూ.1500 కోట్లు మాత్రమే కేటాయింపు జరిగిందన్నారు. దీనిని రూ.5వేల కోట్లకు పెంచాలంటూ బోధనేతర సిబ్బంది, నైట్ వాచ్‌మెన్‌లు, పారిశుద్ధ్య కార్మికులు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తగు సౌకర్యాలను తక్షణమే కల్పించాలని, అందుకోసం రూ.60కోట్లు ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు కోరారు. ఈ సమావేశంలో బి కనకారావు, చీకటి రాజగోపాల్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.