కృష్ణ

గీత దాటితే హద్దు మీరితే తాటతీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : గీత దాటితే తాట తీస్తామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు రౌడీ షీటర్లను హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం విఘాతం కల్పించే విధంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్నారు. దొంగతనం, హత్య, దోపిడీ, ఇతర నేరాలలో పాల్గొని రౌడీ షీటులు కలిగి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ ప్రాంతాలకు చెందిన 25 మంది రౌడీషీటర్లకు గురువారం జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరిని పిలిచి వారు ఏ నేరం పాల్గొన్నది, ఆ నేరం జరిగిన కాలం, గత ప్రవర్తనకు, ప్రస్తుత ప్రవర్తనకు వారిలో వచ్చిన మార్పు, ప్రస్తుతం ఏమైనా నేరాలలో పాల్గొంటున్నారా..? లేదా..? సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారా..? అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. కొంత మందికి వారు చిన్నతనంలోనే వివిధ నేరాలలో పాల్గొని జీవితాన్ని అంధకారంలోకి నెట్టి వేసుకున్నారని, ఇకపై ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉంటే వారిపై ఉన్న రౌడీషీట్లు తొలగిస్తామన్నారు. ఎటువంటి నేరాల జోలికి వెళ్లకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తే మానసిక పరివర్తన రావడమే గాక నేరం చేయాలన ఆలోచన కూడా తొలగిపోతుందన్నారు. జిల్లాలో మొత్తం 1186 మంది రౌడీషీటర్లు ఉన్నారన్నారు. ఓపెన్ చేసిన రౌడీషీట్లను ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పునః పరిశీలించడం జరుగుతుందన్నారు. వాటన్నింటినీ పరిశీలించి గత పది సంవత్సరాల కాలంలో మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి వృద్దాప్యం, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా ఎటువంటి నేరాలలో పాల్గొనకుండా ఉండటం మొదలైనవి పరిగణలోకి తీసుకుని రౌడీషీట్లను తొలగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, చిలకలపూడి సీఐ మోర్ల వెంకట నారాయణ, ఆర్‌పేట సీఐ వెంకటేశ్వరరావు, బందరు తాలుకా సీఐ కొండయ్య, ఇనగుదురు సీఐ అఖిల్ జమా, ఆర్‌ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.